Breaking News
స్వామివారి కళ్యాణాన్ని జరుపుతున్న వేదపండితులు, పాల్గొన్న భక్తులు

శివనామ స్మరణతో మారుమోగిన ఆలయాలు

మోర్తాడ్‌, మార్చ్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలో సోమవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగాయి. గాండ్లపేట్‌, ధర్మోర, శెట్‌పల్లి, వడ్యాట్‌, మోర్తాడ్‌, ఏర్గట్ల, ఆయా గ్రామాల్లోని శివాలయాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయాలన్ని కిక్కిరిసిపోయాయి.

ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆలయకమిటీ ప్రతినిదులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మోర్తాడ్‌ మండల కేంద్రంలోని రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి నిజామాబాద్‌ జిల్లా నుంచే కాకుండా నిర్మల్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ నుంచి భక్తులు తరలివచ్చారు. కాగా శివరాత్రి ఉపవాసాలను పురస్కరించుకొని మంగళవారం ఉదయం నుంచే ఆయా ఆలయాల వద్ద మహాఅన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

Check Also

సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేదల‌కు అండగా ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించే సుస్థిర ...

Comment on the article