Breaking News
అధికారులు పట్టుకున్న వాహనాలు

ఇసుక తరలిస్తే చట్టరీత్యా నేరం

ఆర్మూర్‌, మార్చ్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలో గల వేల్పూర్‌ మోర్తాడ్‌ మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను పోలీస్‌ శాఖ సిబ్బంది ఆర్టీవో అధికారికి అప్పగించారు. అనంతరం అసిస్టెంట్‌ రవాణా శాఖ అధికారి జయప్రకాశ్‌ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ఉపయోగించే ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తే ఆర్టీవో చట్టరీత్యా నేరమని తెలిపారు. ప్రతి ట్రాక్టర్‌ను పరిశీలించి ట్రాక్టర్‌ డ్రైవర్‌ లైసెన్స్‌, సంబంధిత పత్రాలను పరిశీలించి వాహనానికి జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. అనంతరం ట్రాక్టర్లను వాహనాలను ఆర్మూర్‌ ఆర్‌టిసి డిపోకు తరలించారు.

వాహనాలకు సంబంధించినటువంటి ధ్రువపత్రాలను పరిశీలించారు. జరిమానా చెల్లించి వాహనాలు తీసుకువెళ్లాలని ఆయన కోరారు. ఆర్‌టిఓ నిబంధనలకు వ్యతిరేకంగా విధులు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవడమే కాకుండా అధిక మొత్తంలో జరిమానా విధించే అవకాశముందని ఆయన ట్రాక్టర్‌ యజమానులను హెచ్చరించారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *