Breaking News
డిఆర్వోకు వినతి పత్రం అందజేస్తున్న కాలనీవాసులు

తప్పతాగి ఎస్‌ఐ వీరంగం

నిజామాబాద్‌, మార్చ్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారి తప్పతాగి తన స్నేహితులతో ఒక యువకునిపై దాడిచేసి అతన్ని ఆసుపత్రి పాలు చేసిన సంఘటన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఈనెల 8వ తేదీన రాత్రి 11.30 గంటలకు హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ నరేశ్‌, అతని స్నేహితులతో కలిసి తాము నివాసముండే ప్రాంతానికి వచ్చి మద్యం సేవిస్తుండగా స్తానిక యువకుడు రంజిత్‌ వారి వద్దకెళ్లి ఇక్కడ కుటుంబాలు నివాసముంటున్నాయని, మద్యం తాగవద్దని కోరారు. దీంతో ఆగ్రహించిన సదరు ఎస్‌ఐ, అనుచరులు ప్రశ్నించడానికి నువ్వెవరివని అకారణంగా దాడిచేసి కొట్టారని హనుమాన్‌నగర్‌, ఆనంద్‌నగర్‌ కాలనీ పెద్దలు భూమేశ్‌, ప్రకాశ్‌, ఆకుల పాపయ్య, రవికుమార్‌, మురళి, శివకుమార్‌, మోహన్‌ తదితరులు ఆరోపించారు.

ఈ అంశంపై బుధవారం నిజామాబాద్‌ డిఆర్వో అంజయ్యకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. కేవలం మద్యం తాగవద్దని కోరినందుకు రంజిత్‌పై తీవ్రంగా దాడిచేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అన్నారు. రంజిత్‌ తలకు బలమైన గాయాలు కావడంతో నరాలు దెబ్బతిన్నాయని వైద్యులు చెప్పారని, అతని ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆసుపత్రిలో రంజిత్‌ వద్దకెళ్లి సంతకాలు తీసుకొని డిజె దుకాణం వద్ద జరిగిన ఘటనగా కేసు నమోదు చేశారని వారు ఆరోపించారు. దాడికి గురైన వ్యక్తిపై ఎస్‌ఐ నరేశ్‌ తమ్ముడి పేర తప్పుడు ఫిర్యాదు చేసి అక్రమంగా కేసును ఐదవ టౌన్‌లో ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటి కేసు నమోదు చేశారని వారు వాపోయారు. రంజిత్‌పై తప్పుడు ఫిర్యాదు చేసిన ఎస్‌ఐ నరేశ్‌, అతని తమ్మునిపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా రంజిత్‌కు మెరుగైన వైద్య సేవలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *