Breaking News
పరీక్షలు పర్యవేక్షిస్తున్న పోలీసు కమీషనర్‌

కొనసాగుతున్న దేహదారుఢ్యపరీక్షలు

నిజామాబాద్‌, మార్చ్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పోలీసు నియామక మండలి సూచన మేరకు నిజామాబాద్‌ నగర శివారులోని నాగారం స్టేడియంలో ఎస్‌ఐ, కానిస్టేబుళ్ళ దేహదారుఢ్య పరీక్షలు గురువారంతో పదవ రోజుకు చేరినట్టు పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. పదవరోజు వెయ్యి మంది అభ్యర్థులకు గాను 910 మంది అభ్యర్థులు హాజరైనట్టు కమీషనర్‌ వెల్లడించారు.

పరీక్షల్లో ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా రీడర్‌ ప్యాడ్‌లను ఉపయోగించడం ద్వారా ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు, అక్రమాలకు ఆస్కారం లేకుండా పక్కా ప్రణాళికతో నిర్వహిస్తున్నామని, అన్ని చోట్ల సిసి కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మైదాన ప్రాంగణంలో అల్పాహారం, తాగునీరు, మెడికల్‌ బృందాలు, అంబులెన్సు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *