Breaking News
పోలీసులను అభినందిస్తున్న సిపి కార్తికేయ

నిందితుల అరెస్టు

నిజామాబాద్‌, మార్చ్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 13వ తేదీన అర్ధరాత్రి బాల్కొండ, ముప్కాల్‌ మండల కేంద్రాల్లో వైన్స్‌లో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. వారి వద్దనుంచి రూ.13 వేల విలువగల నాణేలు స్వాధీన పరుచుకున్నట్టు వివరించారు. కేసులో ముప్కాల్‌ ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి ఆధ్వర్యంలో చాకచక్యంగా నేర పరిశోధన చేసి నిందితులను 24 గంటలు గడవక ముందే అరెస్టు చేశారని సిపి పేర్కొన్నారు.

నేరస్తులు మహ్మద్‌ ఖలీల్‌ (20), మహ్మద్‌ అహ్మద్‌ (19), షేక్‌ ఇమ్రాన్‌ (21), విశాల్‌ (19) వీరిని అదుపులోకి తీసుకున్నామని, వీరు ఆర్మూర్‌కు చెందినవారని, వీరందరు కలిసి దొంగతనం చేయాలనే ఉద్దేశంతో గత పదిహేను రోజుల క్రితం ఓ మోటారుసైకిల్‌ను ఆర్మూర్‌లో దొంగతనం చేసి ద్విచక్ర వాహనంపై ఈనెల 12న రాత్రి అందరు కలిసి పోచంపాడ్‌కు వెళ్ళి అక్కడినుంచి బాల్కొండలో అర్ధరాత్రి సమయంలో జగదాంబ వైన్స్‌ షట్టర్‌ను పగులగొట్టి అందులోంచి 3 వేల చిల్లర నాణేలు దొంగిలించారు. అనంతరం ముప్కాల్‌ గ్రామానికి వెళ్ళి తుల్జాభవాని వైన్స్‌ షట్టర్‌ పగులగొట్టి అందులోంచి 10 వేల రూపాయల నాణేలు దొంగిలించారు. కేసును నేరపరిశోదన చేసిన ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి బృందాన్ని కమీషనర్‌ అభినందించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్టు సిపి తెలిపారు. కార్యక్రమంలో అదనపు డిసిపి లా అండ్‌ ఆడర్‌ శ్రీధర్‌రెడ్డి, ఆర్మూర్‌ ఏసిపి రాములు, ఆర్మూర్‌ రూరల్‌ సిఐ విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *