Breaking News
శిరీష

యువతి అదృశ్యం

నిజామాబాద్‌, మార్చ్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర శివారులోని సారంగాపూర్‌లోగల ధనలక్ష్మి కాటేజ్‌ ఇండస్ట్రీలో పనిచేస్తున్న నామాల శిరీష (20) అదృశ్యమైనట్టు 6వ టౌన్‌ ఎస్‌ఐ తెలిపారు. శిరీష అన్నయ్య నామాల రాకేశ్‌ పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. బోధన్‌ మండలం నర్సాపూర్‌ గ్రామానికి చెందిన శిరీష నగర శివారులోని ఇండస్ట్రీలో పనిచేస్తుందని, ఈనెల 13వ తేదీన ఇంటినుంచి పనికి వెళ్లిన శిరీష తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె సోదరుడు రాకేశ్‌ ఇండస్ట్రికి వెళ్లి విషయం తెలుసుకున్నాడు. బంధువులు, స్నేహితుల ఇంట్లో ఆచూకి లభించలేదని దీంతో ఆదివారం రాకేశ్‌ పోలీసులకు పిర్యాదు చేశాడు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *