Breaking News

Daily Archives: March 19, 2019

అభివృద్ధి చూడండి – ఆశీర్వదించండి నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజక వర్గ బహిరంగ సభలో ఎంపి కవిత

నిజామాబాద్‌, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లిలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చటానికి బడ్జెట్‌లో సీఎం కేసీఆర్‌ కేటాయింపులు చేశారని, ఆకలి తెలియకుండా నిరుపేదలకు ఇస్తున్న పెన్షన్లు డబుల్‌ చేస్తామని ఎన్నికల్లో చెప్పారని, రెండు వేలు ఏప్రిల్‌ నుండి ప్రారంభమవుతాయని, మే 1 పెరిగిన రెండు వేల పెన్షన్‌ వస్తదని నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం నిజామాబాద్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల సభలో పాల్గొని ప్రసంగించారు. 65 నుండి కాదు 57 ఏళ్ల నుండే పెన్షన్‌ ఇస్తామని సిఎం ...

Read More »

రెండ్రోజులు మద్యం దుకాణాలు బంద్‌…

కామారెడ్డి, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 22న ఉపాధ్యాయుల, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా శాంతిభద్రతల దృష్ట్యా ప్రశాంత పోలింగ్‌ నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్‌ యాక్టు 1968, సెక్షన్‌ 20(1) అనుసరించి కల్లు దుకాణాలు, కల్లు డిపోలు, మద్యం షాపులు, బార్‌ షాపులు ఈనెల 20వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 22వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మూసి వేయాలని కామారెడ్డి జిల్లాకలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశాలు జారీచేశారు. ఎవరైనా ప్రభుత్వ ...

Read More »

స్ట్రాంగ్‌ రూంల పరిశీలన

కామారెడ్డి, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ జహీరాబాద్‌-05 పార్లమెంటు ఎన్నికల నిర్వహణలో భాగంగా సంగారెడ్డి జిల్లా కంది మండలం రుద్రారం గ్రామంలోని గీతం యూనివర్సిటీలోని కౌంటింగ్‌స్టేషన్‌లను, ఇవిఎం, వివిప్యాట్‌ యంత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్‌ రూంలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట జాయింట్‌ కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ఎన్‌.శ్వేత, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ధోత్రె, కామారెడ్డి, ఎల్లారెడ్డి, సంగారెడ్డి ఆర్డీవోలు రాజేంద్రకుమార్‌, దేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

మానవ సంబంధాలే సమాజ మనుగడకు సోపానాలు

కామారెడ్డి, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మానవ సంబంధాలే సమాజ మనుగడకు సోపానాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఉదయం అంతర్జాతీయ సోషల్‌ వర్క్‌ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌ క్యాంపస్‌ ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీని జిల్లా కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో కుటుంబ వ్యవస్థలు కునారిల్లి మానవ సంబంధాలు మృగ్యమై పోతున్నాయని, విపరీత పోకడలు, రుగ్మతలు చోటు చేసుకుంటున్నాయని, ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సోషల్‌వర్క్‌ ...

Read More »

ఐదుస్థానాల్లో ఎంసిపిఐయు పోటీ

కామారెడ్డి, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశంలో 2019 సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఎంసిపిఐయు పార్టీ ఐదు స్థానాలకు పార్టీగా పోటీలో ఉండాలని, మిగతా 12 స్థానాలకు బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ అభ్యర్థులను నిలబెట్టాలని ఈనెల 16, 17 తేదీలలో మిర్యాలగూడలో జరిగిన తెలంగాణ రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశం జడ్పీ నిర్ణయించిందని పార్టీ కామారెడ్డి జిల్లా కార్యదర్శి రాజలింగం తెలిపారు. ...

Read More »

ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డిని గెలిపించండి

కామారెడ్డి, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి అక్షరటెక్నో స్కూల్‌లో కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలొ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌ అని మాటల్లో చెప్పిన కేసీఆర్‌, టిఆర్‌ఎస్‌ పార్టీకి గతంలో ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నప్పుడు వారికి గౌరవం ఇచ్చి గెలిపించామని, ఇప్పటికే టిఆర్‌ఎస్‌కు 16 ...

Read More »

దేశంలో క్రియాశీలక పార్టీగా మారుతున్న తెరాస : నిజామాబాద్‌ బహిరంగసభలో ముఖ్యమంత్రి కెసిఆర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి దేశంలోనే అత్యంత క్రియాశీలక పార్టీగా మారబోతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. సోమవారం నిజామాబాద్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల ప్రచార సభలో సిఎం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, రైతులకు నిరంతరం విద్యుత్తు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కెసిఆర్‌ పేర్కొన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్‌ ఎంపి సీటుతో పాటు మిగతా ...

Read More »