Breaking News

Daily Archives: April 2, 2019

గుండారంలో ఎంపి కవిత ఎన్నికల ప్రచారం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపీ కవిత మంగళవారం గుండారంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ గుండారం గ్రామాన్ని మండలం అయ్యే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తానని, సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని పేదలకు రూ.5 లక్షలు ఇస్తామని ప్రభుత్వం చేయగలిగిన పని చేస్తుందన్నారు. దుబాయ్‌ చాలా చిన్న దేశం కానీ అక్కడికి వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడడానికి గత పాలకుల వైఫల్యమే తెలంగాణలో వస్తున్న మార్పు దేశంలో కూడా ...

Read More »

ఎంపి కవితకు బీడి టేకేదారుల సంఘం మద్ధతు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవితకు తెలంగాణ బీడి టేకేదారుల సంక్షేమ సంఘం, తెలంగాణ రాష్ట్ర బీడి వర్కర్స్‌ యూనియన్‌ మద్ధతు ప్రకటించాయి. మంగళవారం నిజామాబాద్‌లోని ఎంపి ఆఫీస్‌లో జరిగిన కార్యక్రమంలో సంఘాల నేతలు ఎంపి కవితను కలిసి మద్ధతు తెలిపారు. బీడిని పరిశ్రమగా గుర్తించి రాష్ట్రంలోని 4 లక్షల మందికి పెన్షన్‌ను ఇస్తున్న కెసిఆర్‌ దేవుడని బీడి టేకేదారుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు రూప్‌ సింగ్‌ అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు నిజామాబాద్‌ ...

Read More »

ఎంపి కవితకు కమ్మ సంఘం మద్దతు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవితకు నందిపేట్‌ మండలం ఆంధ్రానగర్‌ కమ్మ సంఘం మద్ధతు తెలిపింది. అలాగే పలు సంఘాలు కూడా మద్ధతు తెలిపాయి. మంగళవారం నిజామాబాద్‌ ఎంపి కార్యాలయంలో ఎంపిని కలసిన సంఘం నేతలు సంఘం చేసిన తీర్మాణాల ప్రతులను అందజేశారు. ఎంపి కవితను మళ్లీ ఎంపిగా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక, నిజామాబాద్‌ పట్టణ గోసంగి కుల సంక్షేమ సంఘం, పాముల బస్తీ మాల ...

Read More »

కారెక్కిన మాచల్‌ శ్రీనివాస్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత మోర్చా నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు మచాల్‌ శ్రీనివాస్‌ తన అనుచరులతో కలిసి ఎంపి కవిత సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే జిల్లా రజక జన సేవా సంఘం అధ్యక్షుడు బగ్గలి అశోక్‌, వాల్మీకి సమాజ్‌ మాజీ జిల్లా అధ్యక్షుడు వేద్‌ సుఖ్‌ వీర్‌ సింగ్‌, ఉత్తర్‌ ప్రాంతీయ సమాజ్‌ సీనియర్‌ లీడర్‌లు మనోజ్‌ సింగ్‌, లలన్‌ సింగ్‌, యూపి బ్రాహ్మణ్‌ సమాజ్‌ నాయకుడు రాజు త్రిఫాఠి, బిజెపి దళిత మోర్చా జిల్లా ...

Read More »

పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ పూర్తి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో పోలింగ్‌ విధులు నిర్వహించుటకు సిబ్బందిని నియమిస్తూ కంప్యూటర్‌లో ర్యాండమైజేషన్‌ పూర్తి చేశారు. మంగళవారం ఎన్‌.ఐ.సి.లో జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు, ఎన్నికల పరిశీలకులు గౌరవ దాలియా ఆధ్వర్యంలో ర్యాండమైజేషన్‌ పూర్తి చేశారు. పార్లమెంట్‌ పరిధిలో ఏడు నియోజకవర్గాలకు గాను జగిత్యాల జిల్లాలో రెండు నియోజక వర్గాలు పోగా నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాలకు పోలింగ్‌ సిబ్బందిని కేటాయించారు. 1438 ప్రిసైడింగ్‌ అధికారులు, 1438 సహాయ ప్రిసైడింగ్‌ అధికారులతో ...

Read More »

ఈవీఎంల చెకింగ్‌కు ఫంక్షన్‌ హాల్స్‌ పరిశీలన

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాకు కొత్తగా చేరుకునే ఈవీఎంలను చెకింగ్‌ చేయడానికి ఫంక్షన్‌ హాల్‌లను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. మంగళవారం బోర్గాం వద్దగల విజయలక్ష్మి గార్డెన్‌, మాధవనగర్‌ పరిధిలోగల సుగుణ గార్డెన్లో కలెక్టర్‌ రామ్మోహన్‌రావు, సాధారణ పరిశీలకులు గౌరవ దాలియా, సిపి కార్తికేయ బెల్‌ ఇంజనీర్లు పరిశీలించారు. బుధవారం జిల్లాకు అదనంగా బ్యాలెట్‌ యూనిట్లు రానున్నందున వాటిని ఫస్ట్‌ చెకింగ్‌ అనంతరం కమిషనింగ్‌ చేయుటకు పెద్ద హాలు అవసరం ఉన్నందున వీటిని ఎంపిక చేశారు. భద్రతా పరంగా ...

Read More »

కాంగ్రెస్‌, బిజెపి మ్యాచ్‌ ఫిక్సింగ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 ఎంపి కవిత నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ బిజెపి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నాయని నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్‌లో కొన్ని చోట్ల కలిసే తిరుగుతున్నారని, టిఆర్‌ఎస్‌ను ఓడగొట్టలేం కానీ కనీసం ప్రయత్నమన్నా చేద్దాం అనుకున్నారట, కాంగ్రెసాయన జెండా ఎత్తేశారు.. ఆయన తిరగడం లేదు అని అన్నారు. మంగళవారం బోదన్‌ మండలం అచన్‌పల్లిలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా మహిళలు కవితకు బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. గత ఎన్నికల్లో ...

Read More »

ఎంపి కవితకు మద్దతుగా ప్రచారం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం 49 డివిజన్లో ఎంపీ కవితకు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ నుడా చెర్మెన్‌ ప్రభాకర్‌ రెడ్డి, అతని సతీమణి 49 డివిజన్‌ కార్పొరేటర్‌ విశాలిని రెడ్డి కలసి డివిజన్‌లో విస్తతంగా ప్రచారం నిర్వహించారు. ఎంపీ కవిత చేసిన అభివద్ధి పనులను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

అర్వింద్‌ ధర్మపురికి మా సంపూర్ణ మద్దతు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ ఎంపీ అబ్యర్థి అర్వింద్‌కే తమ మద్దతు ఉంటుందని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు డెవలప్‌ మెంట్‌ ఫోరం, తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు యువత రాష్ట్ర నాయకులు మామిడి అశోక్‌, బండి సంజీవ్‌ వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా మున్నూరు కాపులంతా ఎక్కువ సమయం నిజామాబాద్‌లో ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నామని తెలిపారు. రెండు సంఘాల రాష్ట్రనాయకులు మంగళవారం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్థతంగా పర్యటించి మండల, గ్రామ శాఖల ద్వారా ఇంటింటి ప్రచారం చేశారు. ...

Read More »

పార్టీకి కార్యకర్తలె మూలస్థంభాలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మధుయాష్కి నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్టీకి కార్యకర్తలే మూలస్తంభాలని నిజామాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మధు యాష్కీగౌడ్‌ అన్నారు. బోధన్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే తేలికగా విజయం సాధించవచ్చునని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ పెరిగిందని తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని, ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ అధినేత సోనియాగాంధీ దయవల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ...

Read More »

మోది పాలనలో దేశం సురక్షితం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పాలనలో మన దేశం సురక్షితంగా ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. మంగళవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ్‌ సంకల్ప సభలో ఆయన ప్రసంగించారు. టిఆర్‌ఎస్‌ను గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు గెలిపించారు.. ఈ విషయంలో తమకు బాధ లేదని, మోదీ ప్రభుత్వ పాలనను మీరు చూశారు. అది చూసి బిజెపికి ...

Read More »

నర్సరీని పరిశీలించిన ఏపిడి చందర్‌

బీర్కూర్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలం వీరాపూర్‌ గ్రామంలో నర్సరీని బాన్సువాడ ఏపిడి చందర్‌ మంగళవారం పరిశీలించారు. నర్సరీలో 50 వేల మొక్కలు పెంచే స్థాయి ఉందని, టేకు, ఖర్జుర, కానుగ, జామ, దానిమ్మ, మునగ, గులాబి, గన్నేరు, సీతాఫలం, బొప్పాయి, నల్ల తుమ్మ, సుబాబుల్‌ వంటి మొక్కలు పెంచుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఎండాకాలం అయినందున మొక్కలు ఎండిపోకుండా చూడాలని ఆదేశించారు.

Read More »

తల్లిదండ్రులు గర్వపడేలా ఉన్నతోద్యోగాలు సాధించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తల్లిదండ్రులు గర్వపడేలా విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు సాధించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్‌డి, తెలంగాణ హరితహారం ప్రత్యేకాధికారిణి ప్రియాంక వర్గీస్‌ పోటీపరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు సూచించారు. మంగళవారం స్థానిక జిల్లా గ్రంథాలయంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు రెండునెలలపాటు ఉచిత మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రంథాలయం పూర్తిస్తాయిలో ఏసి సౌకర్యం కల్పించడం, అన్ని వసతులు ఉండడం, అన్ని పుస్తకాలు లభ్యం కావడం పట్ల సంతోషం ...

Read More »

నర్సరీల్లో మొక్కల పర్యవేక్షణపై నివేదిక పంపాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని అన్ని నర్సరీల్లో మొక్కల పర్యవేక్షణపై, పరిస్థితిపై సంబంధిత అదికారులు పర్యవేక్షించి నివేదికలు పంపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్‌డి, హరితహారం ప్రత్యేకాధికారి ప్రియాంక వర్గీస్‌ తెలిపారు. మంగళవారం భిక్కనూరు మండలం బస్వాపూర్‌, అంతంపల్లి, అంచనూరు, మాచారెడ్డి మండలం మాందాపూర్‌, అంబరిపేట, ఫరీద్‌పేట, వాడి, అరేపల్లి గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని స్వయంగా పరిశీలించారు. ఆమె వెంట జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఉన్నారు. జిల్లాలో మొక్కలు పెరగడానికి ఉపయోగించే ఆవుపేడ ద్రావణం తయారీని ...

Read More »

బి.బి.పాటిల్‌ను బారీ మెజార్టీతో గెలిపిద్దాం

కామారెడ్డి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ తెరాస పార్లమెంటు అభ్యర్థి బి.బి.పాటిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని నాయకులు, కార్యకర్తలకు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పిలుపునిచ్చారు. మంగళవారం కామారెడ్డిలో తెరాస ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. అందుకే ఇటీవల జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో తెరాసను ప్రజలు గెలిపించారని, తిరిగి అధికారంలోకి తెచ్చారన్నారు. 16 మంది ...

Read More »

కాంగ్రెస్‌ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి రాహుల్‌ను పిఎం చేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ అన్ని వర్గాల ప్రజల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలతో మ్యానిఫెస్టో రూపొందించిందని వాటిని కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రజల వద్దకు తీసుకెళ్ళి రాహుల్‌గాంధీని ప్రధాని చేసేందుకు సైనికుల్లా కష్టపడాలని మాజీ ఎమ్మెల్సీ మహ్మద్‌ అలీ షబ్బీర్‌ అన్నారు. మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. జహీరాబాద్‌ పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్‌మోహన్‌రావును మంచి మెజార్టీతో గెలిపించి కాబోయే ప్రధాని రాహుల్‌గాంధీకి బహుమతిగా ...

Read More »

ఘనంగా రైతుసమన్వయ సమితి మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

రెంజల్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల రైతు సమన్వయసమితి అధ్యక్షుడు, టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు కాశం సాయిలు జన్మదిన వేడుకలు మంగళవారం కళ్యాపూర్‌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసి అన్నదానం చేశారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ నాయకులు సాయిలు, కుమార్‌, విలాస్‌, విజయ్‌,తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఎంపీ కవితకు మద్దతుగా గ్రామగ్రామాన ప్రచారం

రెంజల్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంపీ కవితను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మండలంలోని తాడ్‌బిలోలి, రెంజల్‌, సాటాపూర్‌, కళ్యాపూర్‌, దూపల్లి, బొర్గం, నీలా గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. కవితక్క గెలుపు టీఆర్‌ఎస్‌ మలుపు అంటూ నినాదాలతో పల్లెల్లో ప్రచారం జోరందుకుంది. తాడ్‌ బిలోలి గ్రామంలో రైతు సమన్వయసమితి జిల్లా సభ్యుడు మౌలానా ఆధ్వర్యంలో వంద మంది కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి కవితను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ...

Read More »

తోపుడు బండ్లతో ఇబ్బందిగా వాహనాల పార్కింగ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు పక్కన ఖాళీస్థలాలు తోపుడు బండ్లతో కిక్కిరిసి పోతున్నాయి. జిల్లా కోర్టు ప్రధాన గేట్‌కు ఇరు పక్కల తోపుడు బండ్లు వెలిశాయి. దీంతో కోర్టుకు వచ్చిన వారి ద్విచక్రవాహనాలు నిలపడానికి స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హడవిడిగా ఎక్కడ పడితే అక్కడ ద్విచక్రవాహాలు నిలిపివెళితే ట్రాఫిక్‌ పోలీసులు ఫోటోలు తీసి ఈ చలానాల ద్వార జరిమానాలు విదిస్తున్నారు. కోర్టులోపల పార్కింగ్‌లో వాహానాలు నిలపడానికి చాలా సందర్భాల్లో స్థలం ఉండడం లేదు. కోర్టుకు ...

Read More »

బుధవారం సిఎం కెసిఆర్‌ ఎన్నికల ప్రచార సభ

బీర్కూర్‌, ఏప్రిల్‌ 2 ద్రోణవల్లి సతీష్‌ నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం ముఖ్యమంత్రి ప్రచార సభను విజయవంతం చేయాలని, పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా బుధవారం రోజు జహీరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఆందోల్‌ నియోజకవర్గ అల్లదుర్గం వద్ద తెరాస అధినేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు పాల్గొనే ఎన్నికల ప్రచార సభను పార్టీ కార్యకర్తలు, రైతులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మాజీ జడ్పీటీసీ ద్రోణావల్లి సతీష్‌ కోరారు. మంగళవారం రోజు నాయకులు, కార్యకర్తలతో కలసి విలేఖరుల ...

Read More »