Breaking News

Daily Archives: April 4, 2019

టిఆర్‌ఎస్‌తోనే బిసిలకు ఆత్మ గౌరవం

ఎంపి కవిత నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిసిలకు ఆత్మగౌరవం కల్పించింది టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్నారు నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత. గురువారం రాత్రి నిజామాబాద్‌ లోని బందావన్‌ గార్డెన్‌లో బిసి ఐక్యకులాల ఆత్మీయ సమ్మేళం కార్యక్రమం జరిగింది. ఎంపి కవిత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పద్మశాలి, త్రివేణి, గౌడ, ముదిరాజ్‌, యాదవ, వంజరి, రజక, మహేంద్ర, క్షత్రియ సమాజ్‌, పూసల, నాయీ బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, వడ్రంగి, వడ్డెర సంఘం, రాజ్‌పుత్‌ సంఘం, ఆర్యవైశ్య ...

Read More »

వెద‌ర్ చేంజ్‌

గాలి…దుమారం…వర్షం…. ఇందూరు, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందూరు చల్లబడ్డది… గురువారం రోజంతా కొంత చల్లదనంగా ఉన్నప్పటికి సాయంత్రం సమయానికి చల్లటి గాలులు వీశాయి. రాత్రికి కొద్దిపాటి వర్షం కూడా కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఇదివరకే తెలిపింది. విదర్భ తీరాన్ని ఆనుకొని చత్తీస్‌గడ్‌ ప్రాంతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతుందని, దీని ప్రభావం ఆదివారం నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది.

Read More »

తెరాస అభ్యర్థిని గెలిపించాలి

హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ బాన్సువాడ, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానిమంత్రి అయ్యే సత్తా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఉందని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. గురువారం బాన్సువాడలోని భారత్‌ గార్డెన్స్‌లో ముస్లిం మైనార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరాస చేపడుతున్న అభివృద్ది పనులే గెలుపునకు బాటలవుతున్నాయని అన్నారు. జహీరాబాద్‌ పార్లమెంటు అభ్యర్థి బి.బి.పాటిల్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. 16 మంది ...

Read More »

మోడీ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదు

కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి ఆరోపణ నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానమంత్రి మోడీ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. గురువారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో చంద్రశేఖర్‌ కాలనీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ నరేంద్ర మోడీ పాలనలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సామాన్య పేద ప్రజలు ఆర్థికంగా ఎదగలేకపోయారని అధికారంలోకి రాకముందు పేద ప్రజల బ్యాంక్‌ అకౌంట్‌లో ప్రతి ఒక్క బ్యాంక్‌ అకౌంట్‌లో రూ 15 లక్షలు ...

Read More »

41 ఎ సిఆర్‌పిసి సవరణ రద్దుకు కషి చేస్తా

లాయర్లతో మాటా – మంతిలో ఎంపి కవిత నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత గురువారం నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఆహ్వానం మేరకు నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ హాలులో లాయర్లతో మాటా- మంతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్‌ లాయర్లు 41 ఎ సిఆర్‌పిసి సవరణ లక్ష్యం ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని ఎంపి కవిత దష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎంపి కవిత ఈ సవరణ వల్ల లాయర్లతో పాటు సామాన్యులు ...

Read More »

పోలీసు స్టేషన్‌ తనిఖీ

బీర్కూర్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌ను గురువారం జిల్లా అడిషనల్‌ ఎస్‌పి అన్యోన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్‌ పనితీరు, రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో భాగంగా సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట ఎస్‌ఐ సందీప్‌ ఉన్నారు.

Read More »

7న ఉగాది కవిసమ్మేళనం

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 7వ తేదీ ఆదివారం తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో ఉగాది కవిసమ్మేళనం నిర్వహిస్తున్నట్టు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గఫూర్‌ శిక్షక్‌, అల్లి మోహన్‌రాజ్‌ తెలిపారు. కామరెడ్డి కర్షక్‌ బిఇడి కళాశాలలో ఉదయం 10.30 గంటలకు కవి సమ్మేళనం ప్రారంభమవుతుందన్నారు. కవులు, రచయితలు, సాహితీ అభిమానులు సకాలంలో హాజరై జయప్రదం చేయాలన్నారు.

Read More »

నిరుపేదల రుణాలకు కెసిఆర్‌ జమానత్‌

జక్రాన్‌పల్లి రోడ్‌షోలో ఎంపి కవిత నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏ ఆధారమూ లేని పేదలకు బ్యాంకులకు సిఎం కెసిఆర్‌ జమానత్‌ ఉండి రూ. 50 వేలు వరకు రుణాలను ఇప్పించారని నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల తెలిపారు. గురువారం నిజామాబాద్‌ రూరల్‌ నియోజక వర్గంలోని జక్రాన్‌పల్లిలో జరిగిన రోడ్‌షోలో ఆమె ప్రసంగించారు. కులాలు, మతాలకు అతీతంగా సిఎం కెసిఆర్‌ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. పేదలు తీసుకున్న రుణాలను బ్యాంకుకు ప్రభుత్వమే చెల్లిస్తుందని కవిత వివరించారు. శక్తివంచన ...

Read More »

ఎంపి కవిత గెలుపుకోసం ప్రచారం

రెంజల్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస నిజామాబాద్‌ పార్లమెంటు అభ్యర్థి ఎంపి కవిత గెలుపుకోసం గురువారం సాటాపూర్‌ సర్పంచ్‌ వికార్‌ పాషా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని కల్వకుంట్ల కవితను గెలిపించాలని కోరారు. అనంతరం ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపడుతున్న కూలీల వద్దకెళ్ళి ప్రచారం చేపట్టారు. ఉపాధి హామీ కూలీలందరు తెలంగాణ బతుకమ్మ, ఇంటి ఆడపడుచు కవితను గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెరాస గ్రామ అధ్యక్షుడు కుర్మె సాయిలు, శ్రీకాంత్‌, ...

Read More »

మధుగౌడ్‌ను ఎంపిగా గెలిపించండి

గల్ఫ్‌ ఎన్‌ఆర్‌ఐల ఎన్నికల ప్రచారం నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌లో మధుగౌడ్‌ వైపే గల్ఫ్‌ ఎన్నారై కుటుంబాలు నిలవాలని గురువారం బహ్రెయిన్‌లో ఎన్నారైలు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 2014లో తెరాస ప్రవాస సంక్షేమం అని చెప్పి ఐదేళ్ళు మోసం చేసిందని, చివరి సంవత్సరం జనవరి 2018లో 100 కోట్లు ప్రకటన చేసి ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో కనీసం ప్రవాసుల మాటే తీయలేదని అలాంటప్పుడు గల్ఫ్‌ ...

Read More »

ఈబిసి రిజర్వేషన్‌ కల్పించిన బిజెపికి కృతజ్ఞులం

రాష్ట్రంలో 10% రిజర్వేషన్‌ తక్షణమే అమలు చేయాలి నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో ఉన్న అగ్రవర్ణ పేదలను దష్టిలో ఉంచుకొని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్‌ కల్పించడం పట్ల బిజెపి ప్రభుత్వానికి తాము కతజ్ఞులమని రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు సంతోష్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం నగరంలోని స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలను దష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ...

Read More »

రైతు సమగ్రసర్వే మే 15లోగా పూర్తిచేయాలి

కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు సమగ్రసర్వే మే 15 లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ వ్యవసాయధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్‌ మండల వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణాదికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. రైతు సమగ్ర సర్వే కార్యక్రమాన్ని సమీక్షించారు. మండలాల వారిగా ఇప్పటి దాకా సాధించిన ఫలితాలను సమీక్షించారు. జిల్లాలో మొత్తం 2 లక్ష 34 వేల 85 రైతులకు సంబంధించి గత నెల 28 తేదీ నుంచి ఇప్పటి ...

Read More »

జిల్లాకు చేరుకున్న ఎమ్‌ 3 ఓటింగ్‌ యంత్రాలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలు సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ కేటాయించిన అధునాతన ఎం3 ఓటింగ్‌ యంత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. బెంగళూరు బెల్‌ కంపెనీ నుండి వచ్చిన ఓటింగ్‌ యంత్రాలను ముందుగా నిజామాబాద్‌ అర్బన్‌ రూరల్‌ బాల్కొండ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటింగ్‌ యంత్రాలను మొదటిదశ చెకింగ్‌ పక్రియ పూర్తిచేశారు. ఈ పక్రియ జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు పర్యవేక్షణలో ఇంజనీర్లు ఈసీ స్పెషల్‌ అధికారులు సమక్షంలో ఓటింగ్‌ యంత్రాల పరిశీలన జరుగుతున్నది. నియోజవర్గ వారీగా ...

Read More »

10,11 హాలిడేస్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోక్‌సభల పోలింగ్‌ సందర్భంగా ఏప్రిల్‌ 10,11న రెండ్రోజులపాటు స్థానికంగా సెలవు ప్రకటించినట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పబ్లిక్‌ బిల్డింగ్స్‌, విద్యాసంస్థలు, ఇతర బిల్టింగ్‌లను పోలింగ్‌ స్టేషన్స్‌, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లుగా వినియోగిస్తున్నందున జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో లోకల్‌ హాలిడే ప్రకటించామన్నారు. అన్ని ప్రబుత్వ కార్యాలయాలు, లేబర్‌, ఎప్లైమెంట్‌ ట్రెని, మునిసిపల్‌ కౌన్సిల్స్‌, లోకల్‌ బాడిస్‌ లోకల్‌ హాలిడేగా ప్రకటించబడ్డాయన్నారు. జిల్లా ట్రెజరీ, సబ్‌ ట్రెజరీలు ఏప్రిల్‌ 10,11న ...

Read More »

జాతీయస్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌ గ్రామ కాంతి హైస్కూల్‌కు చెందిన విద్యార్థి బానవత్‌ ప్రశాంత్‌ అండర్‌-12 జాతీయస్థాయి సాప్ట్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యారని కరస్పాండెంట్‌ కాంతి గంగారెడ్డి తెలిపారు. గతనెల నిజామాబాద్‌ జిల్లా ధర్మారంలో జరిగిన రాష్ట్రస్తాయి పోటీలకు సాప్ట్‌బాల్‌ ప్రెసిడెంట్‌ ప్రభాకర్‌రెడ్డి, జనరల్‌సెక్రెటరీ గంగామోహన్‌ పాల్గొన్నారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రశాంత్‌ని వారు జాతీయస్థాయి సాప్ట్‌బాల్‌పోటీలకు ఎంపికచేసినట్టు పేర్కొన్నారు. ఈనెల 7,8 తేదీల్లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని సోలాన్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్టు ...

Read More »

ప్రజల మనిషి ఎంపి కవితని గెలిపించాలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 4 టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ఎంపీ అభ్యర్థి ఎంపి కవిత ప్రజల మనిషి అని గత ఐదేళ్లలో 15 వేల కోట్లు రూపాయలు నిధులు తీసుకురావడం, అలాగే పసుపు సాధన కోసం పసుపును పండిస్తున్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారని టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. గురువారం ఆర్మూర్‌ పట్టణంలోని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చివరికి పార్లమెంట్‌లో ...

Read More »

జగిత్యాల అసెంబ్లీ నియోజక వర్గంలో అర్వింద్‌ రోడ్డుషో

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని జగిత్యాల నియోజకవర్గంలో రాయికల్‌ మండలంలో వివిధ గ్రామాలలో గురువారం జరిగిన రోడ్‌షోలో నిజామాబాద్‌ బిజెపి ఎంపీ అభ్యర్థి అర్వింద్‌ ధర్మపురి పాల్గొన్నారు. యువత, రైతులు, మహిళలు అఖండ హారతి ఇస్తూ బీజేపీ అభ్యర్ధి అర్వింద్‌కు మద్దతు పలికారు. వెళ్లిన ప్రతీ గ్రామంలోనూ జననీరాజనాలు అందుకున్నారు అర్వింద్‌. రాయికల్‌ మండలంలోని పైడిమడుగు నుండి ప్రారంభమైన రోడ్‌షో ఇటిక్యాల్‌, మూటపల్లి, కొత్తపేట, వడ్డే లింగాపూర్‌, భూపతిపూర్‌, రామోజీపురం, రాయికల్‌, ఆలూరు, ...

Read More »