Breaking News

Daily Archives: April 7, 2019

మంచిప్ప రిజర్వాయర్‌ ముంపు బాధితులకు తగిన న్యాయం చేస్తాం

ఎంపి కవిత నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ కారుగుర్తుకే ఓటెయ్యాలని లేఖ రాసిందని ఎంపి కవిత అన్నారు. ఈ మేరకు ఆదివారం ఎస్‌టిల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరై కవిత మాట్లాడారు. 70 ఏళ్ల నుంచి కాంగ్రెస్‌ మనని ఓటు బ్యాంకుగా మార్చుకుందని, 6 శాతం ఉన్న రిజర్వేషన్‌ 12 శాతం కావాలన్నదే కేసీఆర్‌ లక్ష్యమన్నారు. పనులు చేస్తారనే నమ్మకంతోనే అందరూ కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, ఢిల్లీలో రాష్ట్రాల మాట చెల్లుబాటు ...

Read More »

ఎంపి కార్యాలయంలో నమూనా పోలింగ్‌ కేంద్రం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత క్యాంపు కార్యాలయంలో నమూనా పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 12 ఈవిఎంలతో కూడిన నమూనా పోలింగ్‌ కేంద్రం ఏవిధంగా ఉండబోతుందో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు పోలింగ్‌ కేంద్రం అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న యువ ఓటర్లందరు ఈవిఎం వినియోగించే పద్దతి, నమూనా పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించాలని నిర్వాహకులు కోరారు. నమూనా పోలింగ్‌ కేంద్రం వద్ద కార్యకర్తలు ప్రజలకు, యువ ఓటర్లకు ఈవిఎం యంత్రాలతో ...

Read More »

ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే రెండోసారి అధికారంలోకి వచ్చాం

ఎంపి కవిత నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే రెండోసారి తెరాస పార్టీ అధికారంలోకి వచ్చిందని, ప్రచారంలోనే కాదు ఫలితాల్లో కూడా నెంబర్‌ వన్‌లో ఉంటుందని ఎంపి కవిత అన్నారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్‌ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టిడిపి సీనియర్‌ నేత మండవ వెంకటేశ్వర్‌రావుకు కేసీఆర్‌తో మంచి స్నేహముందని, కలిసి పనిచేశారని, కేసీఆర్‌ నాయకత్వంలో జరుగుతున్న అభివద్ధిని చూసి పార్టీలోకి వస్తున్నారన్నారు. నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే ...

Read More »

కెసిఆర్‌కు ఓటేస్తే మోడికి వేసినట్టే

షబ్బీర్‌ అలీ కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కెసిఆర్‌కు ఓటేస్తే మోడికి ఓటేసినట్టేనని మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం నియోజకవర్గ ముస్లిం మైనార్టీ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆయనతోపాటు జహీరాబాద్‌ ఎంపి అభ్యర్థి మదన్‌మోహన్‌ సతీమణి ప్రీతిరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా షబ్బీర్‌ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ దళితుల గురించి అహర్నిశలు కృషిచేసే పార్టీ కాంగ్రెస్‌ అన్నారు. మైనార్టీలకు నాలుగుశాతం రిజర్వేషన్‌ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందని ...

Read More »

ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్‌ అధికారుల పాత్ర కీలకం

ఎన్నికల పరిశీలకుడు మోహిందర్‌ పాల్‌ అరోరా కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్‌ అధికారుల పాత్ర కీలకమని జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ సాధారణ ఎన్నికల పరిశీలకుడు మోహిందర్‌ పాల్‌ అరోరా అన్నారు. ఆదివారం సంగారెడ్డి కలెక్టరేట్‌ ఆడిటోరియంలో జహీరాబాద్‌ నియోజకవర్గానికి సంబంధించి అబ్జర్వర్స్‌ సమక్షంలో సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, సెక్టోరల్‌ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెక్టోరల్‌ అదికారులు పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేవరకు అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా పనిచేయాలని ...

Read More »

పతి కోసం సతి ప్రచారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ జహీరాబాద్‌ ఎంపి అభ్యర్థి మదన్‌మోహన్‌ సతీమణి ప్రీతి ఆదివారం కామారెడ్డిలో ఇంటింటికి ప్రచారం చేశారు. పట్టణంలోని పలు వార్డుల్లో ప్రజలను కలిసి వారికి పార్టీ కరపత్రాలు అందజేశారు. మదన్‌మోహన్‌రావును గెలిపిస్తే జహీరాబాద్‌ నియోజకవర్గం ఎలా బాగుపడుతుందో, ఎందుకు ఓటేయాలో, కాంగ్రెస్‌పథకాల గురించి వివరించారు. తెరాస కళ్లబొల్లి హామీలు నమ్మకుండా మదన్‌మోహన్‌ను గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. ప్రచారంలో కౌన్సిలర్‌ జమీల్‌, మాజీ కౌన్సిలర్‌ మల్లేశ్‌ యాదవ్‌, మాజీ ఎంపిపి పండ్ల రాజు, ...

Read More »

తెరాసలో పలువురి చేరిక

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 14వ వార్డుకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు వార్డు కౌన్సిలర్‌ నిమ్మ దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ నుంచి తెరాసలో చేరారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ పార్టీ కండువాతో ఆహ్వానించారు. చేరిన వారిలో ఎల్లయ్య, కుంభాల ప్రభాకర్‌, రమేశ్‌, స్వామి, రాజు, బాలాగౌడ్‌, బాలచంద్రం, నర్సయ్య, నాగరాజు, రామిరెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులున్నారు.

Read More »

తెలుగు క్యాలెండర్‌ ఆవిష్కరణ

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎజెంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రూపొందిన తెలుగు నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆదివారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్రేడా సభ్యులు మాట్లాడుతూ తెలుగు సంవత్సరం ఉగాది నుంచే ప్రారంభమవుతుందని, తెలుగుభాషకు, పండగకు ప్రాధాన్యమిచ్చి ఉగాది నూతన తెలుగు సంవత్సర క్యాలెండర్‌ రూపొందించామన్నారు. కార్యక్రమంలో మోతెకృష్ణగౌడ్‌, పిప్పిరి వెంకటి, నిట్టు వేణు, ఆనంద్‌, కుంభాల రవి, క్రెడా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, రాములు, నిట్టు ...

Read More »

సిఎం కేసీఆర్‌తోనే అభివద్ధి

ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కెసిఆర్‌ పాలనలోనే గ్రామాల అభివద్ధి చెందుతుందని అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ హన్మంత్‌ షిండే అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని మహ్మద్‌నగర్‌ గ్రామములో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జహీరాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి బీబీ పాటిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కెసిఆర్‌ పాలనలోనే గ్రామ అభివద్ధి జరుగుతుందన్నారు. 16 ఎంపీ సీట్లను గెలుచుకుంటే ఢిల్లీలో చక్రం తిప్పవచ్చన్నారు. కేసీఆర్‌తోనే గ్రామాలలోని సిసి రోడ్డు పనులు జరిగాయని తెలిపారు. ఆడపడుచుల కోసం మిషన్‌ ...

Read More »

తెలంగాణ భూమి స్వర్గంతో సమానం

నందిని సిధారెడ్డి ఆర్మూర్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ భూమి స్వర్గం అని, ఆ గడ్డపై పుట్టడమే మనకు అన్ని వరాలతో జన్మ ఎత్తడమని, తెలంగాణ బిడ్డగా మనమందరం గర్వించాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ డాక్టర్‌ నందిని సిద్ధారెడ్డి అన్నారు. ఆదివారం ఆర్మూర్‌ యమ్‌ ఆర్‌ గార్డెన్స్‌లో జరిగిన హరిదా రచయితల సంఘం నాల్గవ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే కాదు సాహిత్యంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే రోజు ...

Read More »

జగిత్యాల నుంచే తెరాస జైత్రయాత్ర

ఎంపి కవిత జగిత్యాల, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల నుంచే టిఆర్‌ఎస్‌ జైత్రయాత్ర మొదలవుతుందని అసెంబ్లీ ఎన్నికల్లో తాను చెప్పినట్లుగానే టిఆర్‌ఎస్‌కు భారీ విజయాన్ని అందించిన ప్రజలకు కతజ్ఞతలు తెలిపారు నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత. డాక్టర్‌ సంజయ్‌ని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించారని ముఖ్యమంత్రి సీట్లో కేసీఆర్‌ను కూర్చోబెట్టారని ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేనిదన్నారు. ఆదివారం రాయికల్‌ మండల కేంద్రంలో జరిగిన భారీ బహిరంగ సభలో కవిత మాట్లాడారు. జగిత్యాల జిల్లా చేస్తామని చెప్పినట్లుగానే జిల్లా చేశామన్నారు. ...

Read More »

జోరుగా తెరాస ఎన్నికల ప్రచారం

బీర్కూర్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల కేంద్రంలో జహీరాబాద్‌ నియోజకవర్గ పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. మండల కేంద్రంలో భారీగా కార్యకర్తలు నాయకులు కామప్ప కూడలి వద్ద బైక్‌ ర్యాలీతో పోచారం కుమారుడు దేశాయ్‌పెట్‌ సొసైటీ ఆద్యక్షుఢు పోచారం భాస్కర్‌ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. కామప్ప కూడలిలో భారడీ పోచమ్మ మందిరంలో పూజలు నిర్వహించి గ్రామ ప్రధాన కూడల్ల ద్వారా ప్రచారం నిర్వహిచారు. గ్రామంలో హనుమాన్‌ మందిరం వద్ద పోచారం భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ తెరాస ...

Read More »

ప్రకటనలకు అనుమతి తప్పనిసరి

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల నిబంధనల మేరకు ఎన్నికలు జరిగే రోజు, అంతకుముందు రోజు ఎన్నికల ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్‌ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రకటనలకు ముందస్తు అనుమతి జారి చేయడానికి కలెక్టరేట్లో ఎంసిఎంసి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కమిటీ ద్వారా వాయిస్‌ ఎస్‌ఎంఎస్‌ మెసేజ్‌లు, లోకల్‌ కేబుల్‌ సోషల్‌ నెట్‌వర్క్‌, సినిమా థియేటర్‌ ...

Read More »

2209 సెట్ల యూనిట్‌ ఫస్ట్‌ లెవల్‌ చెకింగ్‌ పూర్తి

సీఈవో రజత్‌కుమార్‌ నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2209 సెట్ల యూనిట్‌ ఫస్ట్‌ లెవల్‌ చెకింగ్‌ పూర్తయిందని, 9వ తేదీన రైతుల ర్యాలీకి అనుమతి ఇచ్చామని, ఓటర్‌ స్లిప్‌, ఎపిక్‌ కార్డ్‌ ల పంపిణి 95 శాతం పూర్తి అయిందని సీఈవో రజత్‌కుమార్‌ పేర్కొన్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఉదయం 8 నుండి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ జరుగుతుందని, ఉదయం 6 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు మాక్‌ పోలింగ్‌ చేయాలని చెప్పారు. ఎన్నికల ...

Read More »

ఎంపి కవితకు కుల సంఘాల మద్దతు

ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి తీర్మాన పత్రాలు ఆర్మూర్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్‌ పట్టణములో కుల సంఘాల పెద్దలను కలిశారు. నిజామాబాద్‌ ఎంపీగా కల్వకుంట్ల కవిత ఆర్మూర్‌ నియోజకవర్గానికి చేసిన సేవలు వారికి వివరించారు. దీనికి సంఘ సభ్యులు తమ పూర్తి మద్దతు టీఆర్‌ఎస్‌ పార్టీకే అని ఏకగ్రీవ తీర్మాన పత్రాలను ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి అందజేశారు. స్వర్ణకార సంఘం – ఆర్మూర్‌ పట్టణం, మున్నూరు కాపు ...

Read More »

మాదిగలకు అండగా ఉంటా

మధుగౌడ్‌ ఆర్మూర్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రకటించింది అంటే అందులో క్రియాశీలక పాత్ర వ్యవహరించింది మధు యాష్కీ గౌడ్‌ అని, అలాగే ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి చాలా సందర్భాల్లో ఉషామెహ్రా కమిషన్‌ ఏర్పాటుకు వివిధ దశల్లో ఎమ్మార్పీఎస్‌ ఉద్యమానికి సహకరించింది కూడా మధుయాష్కీ అని ఎంఆర్‌పిఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ మేరకు ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మధుయాష్కి గౌడ్‌ని గెలిపించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్‌ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశాన్ని ...

Read More »

ఘనంగా బోనాల ఊరేగింపు

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని కోమలంచ గ్రామంలో పోచమ్మ పండుగ నిర్వహించారు. అందంగా అలంకరించిన బోనాలను నల్ల పోచమ్మ ఆలయం వరకు బాజాభజంత్రీలతో తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించారు. అనంతరం అమ్మవారికి ఒడిబియ్యం పోసి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే సోమవారం కుస్తీ పోటీలు జరుగుతాయని ఎంపీపీ సునందా గంగారెడ్డి, సర్పంచ్‌ సదుల అనురాధ సత్యనారాయణ తెలిపారు. పోటీలకు మల్లయోధులు పాల్గొని తమ సత్తా చాటాలని, పోటీలను తిలకించేందుకు ప్రజలు కూడా తరలిరావాలని కోరారు.

Read More »