Breaking News
సభలో మాట్లాడుతున్న ఎంపి కవిత

జగిత్యాల నుంచే తెరాస జైత్రయాత్ర

ఎంపి కవిత

జగిత్యాల, ఏప్రిల్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల నుంచే టిఆర్‌ఎస్‌ జైత్రయాత్ర మొదలవుతుందని అసెంబ్లీ ఎన్నికల్లో తాను చెప్పినట్లుగానే టిఆర్‌ఎస్‌కు భారీ విజయాన్ని అందించిన ప్రజలకు కతజ్ఞతలు తెలిపారు నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత. డాక్టర్‌ సంజయ్‌ని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించారని ముఖ్యమంత్రి సీట్లో కేసీఆర్‌ను కూర్చోబెట్టారని ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేనిదన్నారు. ఆదివారం రాయికల్‌ మండల కేంద్రంలో జరిగిన భారీ బహిరంగ సభలో కవిత మాట్లాడారు. జగిత్యాల జిల్లా చేస్తామని చెప్పినట్లుగానే జిల్లా చేశామన్నారు. కరీంనగర్‌కు దీటుగా జగిత్యాల తీర్చిదిద్దుతామని చెప్పామని ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు తెలిపారు. అలాగే జగిత్యాలకు ధీటుగా రాయికల్‌ను తయారు చేస్తామని చెప్పామని, రాయికల్‌ను మున్సిపాలిటి చేశామని, అభివద్ది చేస్తున్నామని కవిత వివరించారు.

రాయికల్‌ మండలం ఆదిలాబాద్‌ జగిత్యాల జిల్లాలకు వారధిగా ఉందన్నారు. వాటిని కలిపే బోర్ణపల్లి బ్రిడ్జి మంజూరు అయ్యిందని, మేడిపల్లి రోడ్డుకు 13 కోట్లు మంజూరయ్యాయని, డిగ్రీ కాలేజ్‌ కూడా మంజూరు చేయించుకున్నామని ఎంపి కవిత అన్నారు. రాయికల్‌లో బస్టాండ్‌, మున్సిపల్‌ ఆఫీసు, ఇతర సౌకర్యాలు కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తికాగానే అభివద్ధి పనులు వేగం పుంజుకుంటాయని చెప్పారు. రాయికల్‌ టౌన్‌ను రెండు మండలాలుగా చేసుకుందామని ప్రజల సమ్మతితో ఆ పని చేసుకుందామని సీఎం కేసీఆర్‌ నిజామాబాద్‌ సభలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, కొత్త మండలాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సభకు తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు

మరమ్మతులు చేసుకున్న చెరువులు, కుంటలకు 365 రోజుల పాటు సాగునీరు నింపెందుకు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం చేపట్టిందని, కాళేశ్వరం నీళ్లను కాలువలోకి పంపుతామని కవిత తెలిపారు. అత్తాపూర్‌, చింతలూరు, దేవరపల్లి చుట్టుపక్కల గ్రామాలకు నీటి వసతి లేక పోవడంతో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం కోసం ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేశారని తెలిపారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకొని తండాల అభివద్ధికి పాటుపడుతున్నామని అన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు బీడీ కార్మికులను పట్టించుకున్న వారు లేరు అన్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడగానే బీడీ కార్మికులకు పెద్దన్నగా సీఎం కేసీఆర్‌ ఒక వెయ్యి రూపాయల పెన్షన్‌ ఇవ్వడం మొదలుపెట్టారనీ కవిత తెలిపారు. పిఎఫ్‌ కార్డులు ఉన్న వారందరికీ పింఛన్లు వస్తాయని మే ఒకటో తేదీ నుంచి పెంచిన ఒక వెయ్యి రూపాయలు కలిపి మొత్తం 2000 రూపాయల పెన్షన్‌ ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. 65 ఏళ్ల పెన్షన్ల అర్హత వయస్సును 57 ఏళ్లకు సీఎం కేసీఆర్‌ తగ్గించారని తెలిపారు.

ఇంటి నిర్మాణం కోసం జాగాలు ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం మీ అకౌంట్లో వేస్తుందని తెలిపారు. జాగాలు లేనివారికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టించి ఇస్తామని అన్నారు. రెండేళ్ల లోపు అన్ని గ్రామాల్లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను ప్రారంభించి ఐదేళ్ళులో పూర్తి చేస్తామని కవిత వివరించారు. ఇది మీ పెద్దన్న కేసీఆర్‌ ఇల్లు లేని నిరుపేదలకు ఇస్తున్న కానుక అని చెప్పారు. గుడులు, మసీదులు, చర్చిలు అభివద్ధి కోసం రూ. 70 లక్షలు వ్యయం చేశామని, అవసరాన్ని బట్టి కోటి రూపాయలకు పైగా నిధులను వెచ్చించి వాటిని సౌకర్యవంతంగా తయారు చేస్తామని కవిత తెలిపారు.

కుమ్మరిపల్లి గ్రామస్తులు, మండల గౌడ సంఘం ఎంపి కవితకు మద్దతు ప్రకటించింది. రాయికల్‌ మండల ఆర్యవైశ్య మహిళ సంఘం ఏకగ్రీవ తీర్మానం చేయడమే కాకుండా పదివేల రూపాయలను ఎంపీ కవిత ఎన్నికల ఖర్చు కోసం విరాళంగా ఇచ్చారు. అలాగే డాక్టర్‌ సుమన్‌, రోజా రూ.1 లక్ష, పిఎసి.ఎస్‌ చైర్మన్‌ కొల శ్రీనివాస్‌ రూ.25 వేలు ఎంపి కవితకు విరాళం ఇచ్చారు. వారందరికీ ఎంపి కవిత కతజ్ఞతలు తెలిపారు. ఈసారి ఎన్నికల్లో 12 ఈవీఎంలను ఉపయోగిస్తున్నారని, వాటిల్లో మొదటి ఈవిఎంలో తన పేరు రెండవదిగా ఉంటుందని తన ఫోటోతో పాటు కారు గుర్తును చూసి తనను గెలిపించాలని ఎంపీ కవిత ప్రజలను కోరారు.

Check Also

మాస్క్‌లు ధరించకపోతే ప్రమాదంలో పడినట్టే

హైదరాబాద్‌ ప్రతినిధి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనాతో భారత్‌ పోరాటం చేస్తోందని ప్రధాని నరేంద్ర ...

Comment on the article