Breaking News

పలు గ్రామాల్లో మొరాయించిన ఈవీఎంలు

రెంజల్‌, ఏప్రిల్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పలు గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ఈవీఎంలు మొరాయించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండలంలోని దూపల్లి, కందకుర్తి, వీరన్న గుట్ట గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించడంతో గంటల తరబడి పోలింగ్‌ ప్రక్రియకు అంతరాయం కలిగింది. ఓటు వేసేందుకు వచ్చినవారు పోలింగ్‌ కేంద్రాల వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈవీఎంలు మొరయించడంతో ఓటర్లు నానా ఇబ్బందులు పడ్డారు. ఈవీఎంలు పని చేయడం లేదని అధికారుల దష్టికి తీసుకెళ్లడంతో, సంబంధిత అధికారులు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని ఈవీఎంలను సరి చేశారు. అనంతరం యధావిధిగా కొనసాగింది.

Check Also

బిల్లులపై రైతులకు అవగాహన కల్పించాలి

ఆర్మూర్‌, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును విపక్షాలైన కాంగ్రెస్‌ ...

Comment on the article