Breaking News

Daily Archives: April 12, 2019

స్ట్రాంగ్‌ రూంలను ప్రతిరోజు పరిశీలన చేయాలి

రాష్ట్ర ఎన్నికల అదనపు సీఈవో జ్యోతి బుద్ధప్రకాష్‌ నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభ్యర్థుల రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే స్ట్రాంగ్‌ రూమ్‌కు సీలు వేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. రాష్ట్ర ఎన్నికల అదనపు సీఈఓ జ్యోతి బుద్ధ ప్రకాష్‌ స్ట్రాంగ్‌ రూముల ఏర్పాట్లకు జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్‌ అధికారులతో సాయంత్రం హైదరాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటింగ్‌ పూర్తయిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ...

Read More »

ఎన్నికల ఖర్చుకు డబ్బులుంటాయి, కార్మికులకు ఉండవు

ఐదవ రోజు కార్మికుల ధర్నా కామరెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఐదవ రోజు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్‌ కాంట్రక్టు ఎంప్లాయిస్‌ వర్కర్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ( ఏఐటియుసి అనుబంధ సంస్థ) ఎల్‌.దశరథ్‌ మాట్లాడుతూ కార్మికులకు జీతాలు రాక మూడు నెలలు గడుస్తుందని, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కార్మికులు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తెచ్చుకున్న అప్పులు, వడ్డీలు ...

Read More »

15న ఛలో హైదరాబాద్‌

జిల్లా అధ్యక్షునిగా ప్రభాకర్‌ కామరెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో కామరెడ్డి జిల్లాలో భవన నిర్మాణరంగంలోని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈనెల 15న తలపెట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కమిటీలో కామారెడ్డి ఓంకార్‌ సెంట్రింగ్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా ఉన్న కొల్లూరి ప్రభాకర్‌ను జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఐసిటియు జిల్లా బాధ్యులు రాజలింగం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి జిల్లాలోని ఐక్య బిల్డింగ్‌ వర్కర్స్‌ ...

Read More »

14న శ్రీరామనవమి శోభాయాత్ర

కామరెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామసేన ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో శోభాయాత్ర నిర్వహించనున్నట్టు శ్రీరామసేన, విహెచ్‌పి ప్రతినిధులు తెలిపారు. 14వ తేదీన ఆదివారం కామారెడ్డిలో మొదటిసారిగా శ్రీరాముని భారీ విగ్రహంతో శోభాయాత్ర నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కామారెడ్డి పట్టణములో ధర్మశాల నుండి పురవీదుల గుండా నిజాంసాగర్‌ చౌరస్తా వరకు రాముని విగ్రహంతో శోభాయాత్ర ఉంటుందన్నారు. కామారెడ్డి పట్టణ ప్రజలు, చుట్టు పక్క గ్రామాలకు సంబంధించిన హిందూ బంధువులు, రామ, హనుమాన్‌ భక్తులు పెద్ద ...

Read More »

ఘోర రోడ్డు ప్రమాదం : వ్యక్తి మృతి

నందిపేట్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం పలుగ్గుట్ట వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ప్రత్యక్షసాక్షులు, పోలీసుల కథనం ప్రకారం మెట్టు గ్రామానికి చెందిన నామ భాస్కర్‌ (47) తన పొలం ట్రాన్స్‌ఫార్మర్‌ పని నిమిత్తం నందిపేట ఎలక్ట్రిసిటి కార్యాలయానికి వెళ్లాడు. పనిముగించుకొని నందిపేట నుంచి బైక్‌ ఏపి 31 ఏఎల్‌ 6871 పై మెట్టు వైపువెళ్తుండగా పలుగ్గుట్ట వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసి బస్సు ...

Read More »

స్ట్రాంగ్‌ రూమ్‌లకు సీలింగ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి ఎన్నిక పూర్తయిన సందర్భంగా ఈవిఎంలను భద్ర పరచటానికి స్ట్రాంగ్‌ రూంలలో ఉంచి సీలింగ్‌ వేశారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు, కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్తికేయ, సాధారణ పరిశీలకులు గౌరవ్‌ దాలియా, పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూంలకు తాళాలు వేసి లక్కతో సీల్‌ వేశారు. నిజామాబాద్‌ రూరల్‌, నిజామాబాద్‌ అర్బన్‌, బాల్కొండ, బోధన్‌, ఆర్మూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్లమెంటు ...

Read More »

బ్రహ్మూెత్సవాలు ప్రారంభం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని సుభాష్‌నగర్‌ శ్రీరామాలయ శ్రీసీతారామచంద్రస్వామివారి 34వ వార్షిక బ్రహ్మూెత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శుక్రవారం రెండోరోజు ఉదయం నుంచి నిత్యారాధన, యాగశాల ప్రవేశం, ద్వారతోరణ, వాస్తు, సోమ, సుదర్శన కుంభస్థాపన, అగ్ని ప్రతిష్ట, వాస్తు హోమం, గరుడ ప్రతిష్ట, ధ్వజారోహణం, బలిహరణం, ఆరగింపు, తీర్థగోష్టి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శంకర్‌రెడ్డి ఆలయ అధ్యక్షుడు ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు శంకర్‌రెడ్డి మాట్లాడుతూ వార్షిక బ్రహ్మూెత్సవాలు ఏప్రిల్‌ 11వ తేదీ ...

Read More »