Breaking News

బ్రహ్మూెత్సవాలు ప్రారంభం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని సుభాష్‌నగర్‌ శ్రీరామాలయ శ్రీసీతారామచంద్రస్వామివారి 34వ వార్షిక బ్రహ్మూెత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శుక్రవారం రెండోరోజు ఉదయం నుంచి నిత్యారాధన, యాగశాల ప్రవేశం, ద్వారతోరణ, వాస్తు, సోమ, సుదర్శన కుంభస్థాపన, అగ్ని ప్రతిష్ట, వాస్తు హోమం, గరుడ ప్రతిష్ట, ధ్వజారోహణం, బలిహరణం, ఆరగింపు, తీర్థగోష్టి తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

శంకర్‌రెడ్డి ఆలయ అధ్యక్షుడు

ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు శంకర్‌రెడ్డి మాట్లాడుతూ వార్షిక బ్రహ్మూెత్సవాలు ఏప్రిల్‌ 11వ తేదీ గురువారం ప్రారంభమై 17వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. ఇందులో భాగంగా 14వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12.05 గంటలకు మంచి ముత్యాల తలంబ్రాలతో శ్రీసీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్టు చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు.

కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి విఠల్‌రెడ్డి, కోశాధికారి సాయిలు, మదుసూదన్‌రావు, ప్రధాన అర్చకులు తులసీ మురళీధరాచార్యులు, కందాళై సాయి రాఘవాచార్యులు, పి.బాస్కర్‌ భక్తులు పాల్గొన్నారు.

Check Also

28, 29 తేదీల్లో సూపర్ స్పైడర్స్ కు వ్యాక్సినేషన్

నిజామాబాద్‌, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రేషన్ షాప్ డీలర్లు, ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్లు, పెట్రోల్ బంకులు, ...

Comment on the article