Breaking News
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీడీవో చంద్రశేఖర్‌

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

రెంజల్‌, ఏప్రిల్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మే నెలలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సాధారణ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని ఎంపీడీవో చంద్రశేఖర్‌ అన్నారు. మంగళవారం మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 17 గ్రామాల ఎంపిటిసిలకు గాను ప్రిసైడింగ్‌ అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌లకు ప్రతి ఒక్కరూ ఎన్నికల విధి విధానాల ప్రక్రియ నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఎన్నికలు బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా నిర్వహించడం జరుగుతుందని, ఎన్నికల ముందు రోజు ఎన్నికల రోజు అధికారులు చేయవలసిన కార్యకలాపాల గురించి బ్యాలెట్‌ బాక్స్‌ను వినియోగించుట, పోలింగ్‌ ఏజెంట్ల నియామక నిర్వహణ విధుల గురించి వివరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చూడాలన్నారు. ప్రతి ఒక్క ఓటరు గుర్తింపు కొరకు పేర్లు ఐడెంటిటి తప్పనిసరిగా చూడాలని, ప్రతీది క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, మాస్టర్‌ ట్రైనర్స్‌ సోమలింగం గౌడ్‌, సాయరెడ్డి, తహెర్‌, ప్రిసైడింగ్‌ అధికారులు ఆంజనేయులు, విజయలక్ష్మి, శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Check Also

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాంటామని కామారెడ్డి జిల్లా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *