Breaking News

వాస్తవాలు రాస్తే జీర్ణించుకోలేరా?

జర్నలిస్టులపై కేసును ఎత్తివేయకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన

జగిత్యాల, ఏప్రిల్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాలలో ఈవీఎంల వివాదానికి సంబంధించి నిర్భయంగా వాస్తవాలను బహిర్గతం చేసిన 9 మంది జర్నలిస్టులపై అక్రమంగా కేసు నమోదు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) తీవ్రంగా ఖండిస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్‌ అన్నారు. తమ అప్రజాస్వామిక చర్యలకు జర్నలిస్టులు అడ్డొస్తున్నారనే అక్కసుతోనే అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు అక్రమ కేసును బనాయించడం సహించరాని చర్యగా భావిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛను, భావప్రకటన స్వేచ్ఛను హరించే కుట్రల్లో భాగంగానే జగిత్యాలలో 9 మంది జర్నలిస్టులపై అక్రమంగా కేసు నమోదు చేయడం విచారకరమన్నారు. జర్నలిస్టులు దుగ్యాల గోపి కష్ణారావు (వెలుగు), శ్రీధర్‌ (ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌), నరేష్‌ (సాక్షి టీవీ), రాజిరెడ్డి (టీవీ5), సామమహేష్‌ (లోకల్‌చానల్‌), గడ్డల హరికష్ణ (సీవిఆర్‌ న్యూస్‌), హైదర్‌అలీ (మోజో టీవి), రవిందర్‌ (ఆంద్రజ్యోతి),

అక్కినపెళ్లి వేణు (ఆంధ్రప్రభ) లపై 446, 186, 505/2 సెక్షన్ల క్రింద జగిత్యాల టౌన్‌ పోలీస్టేషన్‌లో నమోదు చేసిన కేసును బేషరత్తుగా ఉపసంహరించాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తప్పదని హెచ్చరించారు.

నేడు జగిత్యాలలో ఆందోళన

9 మంది ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియా జర్నలిస్టులపై అక్రమంగా నమోదైన కేసును తక్షణమే ఎత్తివేయాలనే డిమాండుతో నేడు టీయుడబ్ల్యుజె-ఐజేయు జగిత్యాల జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు వినతి పత్రాలను అందించ నున్నామన్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *