Breaking News

మూడు విడతల్లో ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు

హైదరాబాద్‌ ఏప్రిల్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు మూడు విడతలుగా నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. మే 6 వ తేదీన మొదటి విడతలో 212 జెడ్పిటిసిలు, 2365 ఎంపిటిసిలకు పోలింగ్‌ జరగనుండగా, మే 10 వ తేదీన రెండవ విడతలో 199 జెడ్పిటిసి, 2109 ఎంపీటీసీలకు, అదేవిధంగా మే 14 వ తేదీన మూడవ విడతలో 124 జెడ్పిటిసిలు, 1343 ఎంపిటిసిలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 535 జెడ్పిటిసిలు, 5817 ఎంపీటీసీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఒక్క కోటి 56 లక్షల 11 వేల 320 మంది ఓటర్లు,

మొత్తం 32007 పోలింగ్‌ కేంద్రాలలో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *