Breaking News

ఇంటర్‌ ఫలితాలపై కలెక్టర్‌ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం విడుదలైన ఇంటర్‌ ఫలితాలలో మరింత మెరుగైన ర్యాంకులు సాధించినందుకు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అభినందించారు. గురువారం ఇంటర్‌మీడియట్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం ఫలితాలలో ద్వితీయ సంవత్సరం ఫలితాలలో జిల్లా ఎనిమిదవ ర్యాంకు సాధించగా ఈ సంవత్సరం ఏడవ ర్యాంకుతో మరింత ముందు వరుసలో నిలిచిందన్నారు.

అదే విధంగా గత సంవత్సరం ప్రథమ సంవత్సరం పరీక్షలలో తొమ్మిదవ ర్యాంకును ఈ సంవత్సరం కూడా నిలపెట్టుకోవడంపై కలెక్టర్‌ సంతప్తి వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం ప్రథమ సంవత్సరం విద్యార్థులు 57 శాతం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 67 శాతం ఫలితాలు సాధించారని కలెక్టర్‌ తెలిపారు.

ఈ సం. ప్రథమ సంవత్సరంలో అపూర్వ ఎంపీసీలో 1000కి 967 ముస్కాన్‌ బైపీసీలో 1000కి 965 మార్కులు సాధించినందుకు కలెక్టర్‌ వారిని అభినందించారు. ఈ ఫలితాలు సాధించడంలో సంవత్సరం పాటుగా కషి చేసిన అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులను కలెక్టర్‌ అభినందించారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *