Breaking News

ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపు

కామారెడ్డి, ఏప్రిల్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపు బల్దియాకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లిస్తే వినియోగదారులకు రిబేటు ఇస్తుండడంతో వినియోగదారులు ముందస్తుగా పన్నులు చెల్లిస్తున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఎం.జి.వేణుగోపాల్‌గౌడ్‌ తన కౌండిన్య కాంప్లెక్సుకు సంబంధించిన 2019-20 సంబంధించి ముందస్తు ఆస్తిపన్ను కింద రూ. 2 లక్షల 36 వేల 760 లు గురువారం మునిసిపల్‌ కమీషనర్‌కు అందజేశారు.

ముందస్తు పన్ను చెల్లింపుతో ఆస్తిపన్నుల వసూలులో సిబ్బంది లక్ష్యాన్ని చేరుకుంటున్నారని, పన్ను వసూలు ద్వారా బల్దియా ఆర్థిక వెసులుబాటుకు తోడ్పడుతుందని కమీషనర్‌ అన్నారు. ప్రజలు విధిగా ఆస్తిపన్ను చెల్లించాలని కోరారు.

Check Also

జాకోరాలో సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారి

బాన్సువాడ, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 17వ రోజు వర్ని మండలం జాకోరా గ్రామంలో జహీరాబాద్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *