Breaking News
హనుమాన్‌ శోభాయాత్ర నిర్వహిస్తున్న దృశ్యం

గ్రామ గ్రామాన అన్నసత్రాలు

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని మండలంలోని ఆయా గ్రామాల్లోని హనుమాన్‌ ఆలయాల్లో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి సిందూరపూజలు, అభిషేకాలు, అర్చనలు, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హనుమాన్‌ ఆలయాల వద్ద పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

ఆలయాల వద్ద భక్తుల సౌకర్యార్థం షామియానాలు, తాగునీరు, అన్నదానం ఏర్పాటుచేశారు. పలు గ్రామాల్లో హనుమాన్‌ శోభాయాత్ర నిర్వహించారు. యువకులు కేరింతలు కొడుతూ నృత్యాలు చేస్తు జైశ్రీరామ్‌, జై హనుమాన్‌ నామస్మరణతో మారుమోగింది.

Check Also

సిఎం చిత్రపటానికి పాలాభిషేకం

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలోని రజకులందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర ...

Comment on the article