Breaking News

పండ్లరసాలు వాటి ఉపయోగాలు

వెల్లుల్లి

వెల్లుల్లి చాలా శక్తివంతమైన యాంటిసెప్టిక్‌. వెల్లుల్లి రసాన్ని అంతే మొత్తంలో నీటికి కలిపి తీసుకుంటే కలరా క్రిములు నశిస్తాయి. వెల్లుల్లిని టైఫాయిడ్‌ నిరోధించడానికి వాడవచ్చు. దీనిలో ఉండే సల్ఫాయిడ్‌ నూనె ముఖ్యమైనది. శ్వాసవ్యాధులకు, న్యుమోనియా సమస్యలకు ఇది అద్భుతమైన మందు. న్యుమోనియా లక్షణాలు అయిన టెంపరేచర్‌, శ్వాస, నాడి అవకతవకలను కేవలం ఏడు రోజులలోనే వెల్లుల్లి రసం వాడటం వలన మాములు స్థితికి తేబడ్డాయి. ఎటువంటి కడుపుబ్బరానికి అయినా , పక్షవాతం, శరీరం మొత్తం పట్టేయడం, గుండె సమస్య, కడుపునొప్పి, ఎన్నో రోగాలను నయం చేస్తుంది. బ్రాంకైటిస్‌ వ్యాధిలో వెల్లుల్లి చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

కొంతమంది వైద్యులు వెల్లుల్లిని క్షయవ్యాధి చికిత్సలో భాగంగా సూచిస్తున్నారు. వెల్లుల్లి శ్లేష్మాన్ని బయటకి పంపుతుంది. నిద్రని కలిగిస్తుంది. జీర్ణశక్తిని అభివద్ధిపరుస్తుంది. బరువు పెరగడానికి సహాయపడుతుంది. పేగులలో ఉండే ఇన్ఫెక్షన్‌ సమస్యను నిరోధించి పేగులకు జీవం ఇస్తుంది. అజీర్ణం, జీవరసాలు మెల్లగా ప్రవహించడం, గ్యాసుకి అద్భుతమైన మందు. దీర్ఘకాలిక విరేచనాలు వంటి దీర్ఘకాలిక ప్రేగు వ్యాధులను అదుపుచేయడంలో మంచిఫలితాలు వస్తాయి. పుండ్లు, అల్సర్లు కుళ్ళిపోకుండా ఉండటానికి వెల్లుల్లిని వాడతారు. వీటితోపాటుగా వెల్లుల్లి రసాన్ని ఇన్ఫెక్షన్‌కి గురి అయిన పుండ్లు శుభ్రపరచడానికి వాడతారు. చెడు అల్సర్లు కూడా తొందరగా బాగుపడుతుంది. నొప్పి ఆగిపోతుంది.

పుండ్లు, అల్సర్లు డ్రెస్సింగ్‌ చేయడానికి వెల్లుల్లి రసానికి మూడు భాగాలు నీటితో కలిపి పలచగా చేసి పుండ్లు, అల్సర్ల ను కడగడానికి ఉపయోగించవలెను. గౌట్‌, మూత్రపిండాలలో, ఊపిరితిత్తుల్లో రాళ్లు విషయంలో ఉపయోగకరం. ఇది అధిక రక్తపోటును తగ్గించును. చెముడు, చెవిలో పోటు సమస్యలకు ఒక్క చుక్క చెవిలో వేసిన నయం అగును.

గమనిక

నాచే రచించబడిన ”ఆయుర్వేద మూలికా రహస్యాలు”, ”ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు” అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు, చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను. మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది. రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను, భూమిని బట్టి, రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం, ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి.

ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వ క్షయుర్వేద యోగాలు, పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు. ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది. విలువ 350 రూపాయలు మాత్రమే. ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది. విలువ 450 రూపాయలు. మీకు కొరియర్‌ ద్వారా వస్తాయి. కొరియర్‌ చార్జీలు కూడ ఇందులోనే పైన మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80 జిఎస్‌ఎం పేపరుతో ఉంటాయి.

ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్‌ కి ఫోన్‌ చేయగలరు. కాళహస్తి వేంకటేశ్వరరావు (అనువంశిక ఆయుర్వేద వైద్యులు).

Check Also

భీమ్‌గల్‌ ఉత్తరాధి మఠం ఆధ్వర్యంలో ఆహార వితరణ

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరమ పూజ్య శ్రీ సత్యాత్మ తీర్థ యొక్క దైవిక ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *