కామారెడ్డి, ఏప్రిల్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు ఉరుదొండ నరేశ్ బుధవారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సమక్షంలో తెరాసలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే తెరాసలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్న అభివృద్ది పనులకు ఆకర్షితులై తెరాసలో చేరినట్టు నరేశ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు ముజీబుద్దీన్, నిమ్మ మోహన్‌రెడ్డి, మామిండ్ల అంజయ్య, రాజేశ్వర్, చంద్రశేఖర్‌రెడ్డి, గౌరీశంకర్, గోపీగౌడ్, వెంకటి తదితరులు పాల్గొన్నారు.
Read More »Daily Archives: April 24, 2019
విజ్ఞానం సాంకేతిక పరిజ్ఞానంతో రైతులు అభివృద్ది చెందాలి
కామారెడ్డి, ఏప్రిల్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాస్త్రవేత్తలు అందించిన విజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని రైతులు మొక్కవోని ధైర్యంతో వ్యవసాయాన్ని అభివృద్ది పథంలో నడిపించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. వ్యవసాయశాఖ, రాష్ట్ర ప్రభుత్వం, కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూర్ సంయుక్తంగా నిర్వహించిన కిసాన్మేళ, రైతు సదస్సు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రైతులనుద్దేశించి మాట్లాడారు. విజ్ఞానం, వికాసం, విత్తం అనేవి మూడు ప్రధాన అంశాలు మాత్రమే మానవాళికి, రైతుల అభివృద్దికి దోహదపడతాయని తెలిపారు. సమన్వయ సమితి ...
Read More »నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, ఏప్రిల్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జడ్పిటిసి, ఎంపిటిసి నామినేషన్ కేంద్రాలైన మాచారెడ్డి, దోమకొండ, ఎంపిడివో కార్యాలయాలను బుధవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్బంగా మాచారెడ్డి మండలంలో రెండు జడ్పిటిసి నామినేషన్ ఫారాలను రికార్డుల్లో రిటర్నింగ్ అధికారి పొందుపరిచిన సమాచారాన్ని ఆయన పరిశీలించారు. మొదటి దఫా ఎంపిటిసి, జడ్పిటిసి నామినేషన్ల సమాచారాన్ని రికార్డుల్లో పూర్తిస్తాయిలో నమోదు చేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపిడివోలు, అధికారులు ఉన్నారు.
Read More »కిసాన్ ఫ్యాషన్ మాల్ ప్రారంభించిన సమంత
కామారెడ్డి, ఏప్రిల్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిలో బుధవారం కిసాన్ ఫ్యాషన్ షాపింగ్ మాల్‌ను ప్రముఖ సినీనటి అక్కినేని సమంత ప్రారంభించారు. ఆమెను చూసేందుకు వేలాదిగా అభిమానులు షోరూం వద్దకు తరలివచ్చారు. దీంతో నిజాంసాగర్ చౌరస్తా జనసంద్రంగా మారింది. షోరూం ప్రారంభించిన అనంతరం సమంత మాట్లాడుతూ హైదరాబాద్ స్థాయిలో అన్ని రకాల వస్త్రాలతో కామారెడ్డిలో వినియోగదారులకు అతిపెద్ద షోరూం అందుబాటులోకి తేవడం ఆనందంగా ఉందన్నారు. వస్త్రాల కోసం హైదరాబాద్ లాంటి నగరాలకు రావాల్సిన అవసరం లేకుండా తమకు అందుబాటులోనే వస్త్రాలు ...
Read More »సిఎం స్పందించకపోవడం సిగ్గుచేటు
కామారెడ్డి, ఏప్రిల్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల 17 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందని, గ్లోబరేనా సంస్థకు కాంట్రాక్టు ఇవ్వడం వల్లనే సమస్యలు తలెత్తాయని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కుంభాల లక్ష్మణ్ మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం తెలంగాన జనసమితి, తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కార్యాలయం ముందు కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన ...
Read More »రుసుము తీసుకోకుండా రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ చేయాలి
కామారెడ్డి, ఏప్రిల్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ ఫలితాలలో జరిగిన అవకతవకలు ప్రభుత్వానికి కనబడటం లేదా, 19 మంది విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వానికి కనబడడం లేదా అని కామారెడ్డి టిజివిపి నాయకులు ప్రశ్నించారు. బుధవారం కామారెడ్డి టిజివిపి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలు కండ్లకు కట్టుకొని మోకాళ్ళపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల నవీన్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఫలితాలలో చాలా అవకతవకలు జరిగాయని, 19 మంది విద్యార్థులు ...
Read More »ఇంటింటా రైతు సమగ్రసర్వే
రెంజల్, ఏప్రిల్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటింటా రైతు సమగ్ర సర్వే రెండో విడతలో భాగంగా రెంజల్ మండలం బాగేపల్లి గ్రామంలో బుధవారం జెడిఏ గోవింద్ ఆద్వర్యంలో రైతు సర్వే నిర్వహించారు. గ్రామాల్లోని ప్రతి రైతు తన సొంత భూమి వివరాలను అధికారుల దష్టికి తీసుకువెళ్లి ధవీకరించుకోవాలనీ అట్టి భూమి పట్టాబుక్ జిరాక్స్, బ్యాంక్ ఖాతాబుక్, ఆధార్ కార్డు కాపీలను జతచేసి రైతు తన పేరున నామినితో పాటు జీవితభీమ చేసుకోవాలని జేడీఏ రైతులకు సూచించారు. ఆయన వెంట జిల్లా ...
Read More »ఇంటర్ విద్యార్థులకు ఊరట
ఫలితాల వివాదంపై సిఎం కెసిఆర్ కీలక నిర్ణయం హైదరాబాద్, ఏప్రిల్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పాసయిన విద్యార్థులు కూడా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోరుకుంటే గతంలో ఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియను వీలయినంత త్వరగా ముగించి విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్సుడు సప్లిమెంటరీ ...
Read More »కూలి కోసం ఉపాధి కష్టాలు
నిజాంసాగర్, ఏప్రిల్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పై చిత్రం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది… ఎండాకాలం మండుటెండలో ఓ కూలీ ఉపాధి పనులు చేస్తున్నాడు. పలుగుపట్టి మట్టి తవ్వకం పనులు చేస్తున్నాడు… అనుకుంటున్నాము కదూ అంతేకాదు తన చిన్నారి ముద్దు కొడుకును వీపుకు కట్టుకొని స్వయంకృషి చేస్తున్నాడు. ఈ దృశ్యం బుధవారం నిజామాబాద్ న్యూస్ కంటపడింది… అంతే ఫోటో క్లిక్ మనిపించింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హజీపూర్ గ్రామ శివారులో ఉపాధి హామీ పనులు జరుగుతున్న సందర్భంలో హజీపూర్ కట్టకింది ...
Read More »