Breaking News

Daily Archives: May 1, 2019

తెరాస నుంచి మాజీ సర్పంచ్‌ సస్పెండ్‌

డిచ్‌పల్లి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ మఠంల శేఖర్‌ను టిఆర్‌ఎస్‌ పార్టీ నుండి సస్పెండ్‌ చేస్తున్నామని, ఆయనకు సహకరించిన పార్టీ కార్యకర్తలపై కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయని ఇందల్వాయి మండల పార్టీ ఇన్‌చార్జి దినేష్‌ అన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. అధిష్ఠానం నిర్ణయించిన వారికే బిఫారాలు ఇచ్చి టికెట్లు కేటాయించామని పార్టీ నిర్ణయించిన వారికి సహకరించి వారి గెలుపులో భాగస్వాములు కావాలని సూచించారు. ...

Read More »

3వ తేదీలోగా ఓటరు స్లిప్పులు అందజేయాలి

నిజామాబాద్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నిజామాబాద్‌ జిల్లాలో ఎండలు తీవ్రంగా ఉన్నందున జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు ఇబ్బందులు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల జిల్లా పరిశీలకులు అభిలాష్‌ బిష్ట్‌ జిల్లా కలెక్టర్లను కోరారు. జిల్లాలో మూడో విడత జరుగు ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్‌ ప్రక్రియ సందర్భంగా రెండు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్నందున చల్లటి త్రాగునీరు, నీడ కోసం టెంట్లు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు పోలింగ్‌ స్టేషన్ల ...

Read More »

సూక్ష్మ పరిశీలకుల పాత్ర ముఖ్యమైంది

నిజామాబాద్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో జరుగు జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలు నిష్పక్షపాతంగా సజావుగా జరిగేందుకు కషి చేయాలని జిల్లా పరిశీలకులు అభిలాష్‌ బిస్టు అన్నారు. బుధవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జరుగు సూక్ష్మ పరిశీలకుల శిక్షణా తరగతిలో మాట్లాడుతూ ఎన్నికలు నిష్పక్షపాతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఓటర్లను ప్రలోభాలకు ఇతర చర్యలకు ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నందున స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలని ...

Read More »

కార్మికుల ప్రాణత్యాగ ఫలితమే మేడే

ఆర్మూర్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చికాగో నగరంలో 8గంటల పని సమయం కొరకు జరిగిన పోరాటంలో అనేక మంది కార్మికులు ప్రాణత్యాగం చేసి తమ హక్కులను సాధించుకోవడం వల్లనే కార్మికులు ప్రపంచ వ్యాప్తంగా మేడే వేడుకలు జరుపుకుంటున్నామని ఏఐటియుసీ ఆర్మూర్‌ డివిజన్‌ కార్యదర్శి ఆరేపల్లి సాయిలు అన్నారు. బుదవారం ఆర్మూర్‌లోని మార్కెట్‌ యార్డు ప్రాగణంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సివిల్‌ సప్లై కార్మికులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Read More »

మేడే వర్ధిల్లాలి

డిచ్‌పల్లి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం 133వ మేడే సందర్భంగా గన్‌పూర్‌ గ్రామ పంచాయతీ, నడిపల్లి గ్రామ పంచాయతీ, రైల్వేస్టేషన్‌ ఎదుట ఎర్ర జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పివైఎల్‌ నిజామాబాద్‌ డివిజన్‌ అధ్యక్షులు సాయినాథ్‌ మాట్లాడుతూ ఆరోజు కార్మికులకు 18 గంటల పని ఉండే దాన్ని ఎనిమిది గంటల పని కల్పించాలని చెప్పేసి కార్మికులు అందరూ కూడా చికాగోలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగిందన్నారు. ఉద్యమంలో నలుగురు కార్మికులు చనిపోగా వారి రక్తంతో ఓ కార్మికుడు ...

Read More »

బిఫాంల అందజేత

బాన్సువాడ, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలో జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ప్రాదేశిక స్థానాలకు పోటీచేస్తున్న అభ్యర్థులకు తెరాస పార్టీ బిఫాంలు అందజేశారు. బాన్సువాడ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యులు, దేశాయ్‌పేట్‌ సింగిల్‌విండో అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి పోటీదారులకు బిఫాంలు అందించారు. బుధవారం బాన్సువాడలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని బాన్సువాడ, బీర్కూర్‌, నసురుల్లాబాద్‌, వర్ని, రుద్రూర్‌, కోటగిరి, చందూరు, మోస్రా మండలాల్లో జడ్పిటిసి మండల ప్రాదేశిక స్థానాలకు పోటీపడుతున్న అబ్యర్థులకు బిఫారాలు అందించారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ...

Read More »

మూడో విడత ఎన్నికలకు రెండో దశ ర్యాండమైజేషన్‌ పరిశీలన

నిజామాబాద్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలో జరుగు ఎంపీటీసీ జడ్పిటిసి మూడో విడత ఎన్నికల కోసం కావలసిన సిబ్బంది రెండో దశ ర్యాండ మైజేషన్‌ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు ఎన్నికల పరిశీలకులు అభిలాష్‌ బిస్ట్‌ సమక్షంలో నిజామాబాద్‌ ఎన్‌ఐసి కేంద్రంలో పూర్తి చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో మూడో విడతలో ఆర్మూర్‌ డివిజన్‌లోని 11 మండలాల్లో 124 ఎంపీటీసీ, 11 జడ్పిటిసి స్థానాలకు ఎన్నికల నిర్వహణకు 639 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 767 ...

Read More »

ఆందోళనలో రైతులు….

బాన్సువాడ, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర రూపం దాల్చి తూఫాన్‌గా మారుతున్న తరుణంలో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా తుఫాను కోస్తాంధ్ర ప్రాంతంవైపు దూసుకొస్తుందని, దీనివల్ల ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. ఈ సమయంలో ఈ ప్రాంత రైతులు సైతం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కామారెడ్డి జిల్లా ప్రాంతంలో రబీలో సాగైన వరి, మొక్కజొన్నల పంటలకు సంబంధించి ముమ్మరంగా నూర్పిడిలు సాగుతున్నాయి. చాలా వరకు పంటచేతికందుతోంది. యంత్రాల ద్వారా పంట నూర్పిళ్ళు ...

Read More »

మే డే వర్ధిల్లాలి

కార్మిక కర్షక పండుగ శ్రమ జీవుల సంఘము మే డే మీరు లేని చోటేదీ శ్రమే ఒక మూలకం నీవు ఉత్పత్తి కారకం దేశ ప్రగతికి మూలం కానీ ఆకలి మిగిలి అనారోగ్యం జత అయ్యి బుక్కెడు బువ్వకు అర్రులు చాసి తనువులు చాలిస్తున్న మీ శాపం పాలకుల పెట్టుబడి దారులకు తగిలి తగిలి అని మాటలతో కాదు అసంఘటితము కాదు సంఘటితమై సాధించు, నినదించు పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్లు తప్ప ఉద్యమించండి, హక్కులు సాధించండి నీకు పేర్లు వేరైనా నీ ...

Read More »