Breaking News

Daily Archives: May 2, 2019

తెలంగాణ బంద్‌ ప్రశాంతం

ఆర్మూర్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్‌ వ్యవస్థ తీరుపై బిజేపి ఆద్యర్యంలో గురువారం చేపట్టిన బంద్‌ కార్యక్రమం ఆర్మూర్‌ పట్టణ ప్రాంతంలో ప్రశాంతంగా ముగిసింది. వ్యాపారస్తులు, పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించారు. అనంతరం బిజెపి నేతలు సిఎం కేసిఆర్‌, జగదీశ్వర్‌ రెడ్డి దిష్టి బొమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో పూజ నరేందర్‌, ప్రశాంత్‌, నవీన్‌, భరత్‌, ప్రశాంత్‌ పాల్గొన్నారు.త

Read More »

కాంగ్రెస్‌ నాయకుల కొవ్వొత్తుల ర్యాలీ

కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ బోర్డు నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తు ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్తుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేస్తు కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి కాంగ్రెస్‌ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం, రైల్వే స్టేషన్‌, రైల్వే కమాన్‌ మీదుగా నిజాంసాగర్‌ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు. ప్రభుత్వం ఇంటర్‌ బోర్డు, విద్యాశాఖమంత్రిపై చర్యలు తీసుకోవాలని, చనిపోయిన విద్యార్థుల ...

Read More »

ఎన్నికల విదులు నిర్వహించే వారికి ఆర్జిత సెలవులు ఇవ్వాలి

కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి సెలవుల్లో ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు (ఇఎల్‌) మంజూరు చేయాలని పిఆర్‌టియుటిఎస్‌ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా సంఘం జిల్లా అద్యక్షుడు దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ వేసవి సెలవుల్లో సైతం ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులు పాల్గొంటున్నారని, జీవో నెంబర్‌ 35 ప్రకారం ఇఎల్‌ మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో కుషాల్‌, ఉపాధ్యాయ సంఘం నేతలు పాల్గొన్నారు.

Read More »

48 టన్నుల రా రైస్‌ను మిల్లర్లు సరఫరా చేయాలి

కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 48 టన్నుల పాత ఖరీఫ్‌ రా రైస్‌ను జూన్‌ 30 లోగా రైస్‌మిల్లర్లు ఎఫ్‌సిఐ వారికి సరఫరా చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి తెలిపారు. బుధవారం జనహితలో ఎఫ్‌సిఐ, రైస్‌మిల్లర్లతో ఆయన సమీక్షించారు. రైస్‌మిల్లర్లకు ఇచ్చిన టార్గెట్‌ ప్రకారం ధాన్యం సరఫరా చేయాలని తెలిపారు. ధాన్యం క్వాలిటి విషయంలో కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కమిటీ సమన్వయంతో ధాన్యం సరఫరా అయ్యేలా చూస్తుందని చెప్పారు. రైస్‌మిల్లర్లలో డీ ఫాల్టర్లు ఉంటే వారిని ...

Read More »

స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో మూడోవిడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. మూడో విడత నామినేషన్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన నిజాంసాగర్‌, ఎల్లారెడ్డి, ఎంపిడిఓ కార్యాలయాల్లో నామినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 6వ తేదీన మొదటివిడత కింద 99 జడ్పిటిసి, 88 ఎంపిటిసి, మే 10న రెండో విడత కింద 7 జడ్పిటిసి, 77 ఎంపిటిసి, మే 14న మూడో విడత కింద ...

Read More »

సాప్ట్‌బాల్‌ క్రీడలో రాణిస్తున్న గుగులోత్‌ మమత

ఆర్మూర్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏప్రిల్‌ నెల 27 నుండి 30 వరకు నలంద హై స్కూల్‌ క్రీడా మైదానంలో జరిగిన ఆరవ రాష్ట్రస్థాయి జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలలో మానస హై స్కూల్‌ విద్యార్థిని గూగులోత్‌ మమత పాల్గొని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి బెస్ట్‌ క్యాచర్‌ అవార్డుని రాష్ట్ర సాప్ట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కే.శోభన్‌ బాబు చేతుల మీదుగా అందుకుంది. ఈనెల 23 నుండి 27 వరకు ఆర్మూర్‌లో జరగనున్న జూనియర్‌ జాతీయ స్థాయి పోటీల ...

Read More »

ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సర్వసన్నద్ధం

కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. గురువారం జక్రాన్‌పల్లి, నందిపేట్‌ మండల కేంద్రాల్లో కొనసాగుతున్న నామినేషన్ల చివరి రోజు ప్రక్రియను, ఎన్నికల ఏర్పాట్లను ఆయన పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్‌ అధికారులకు ఎన్నికల నిర్వహణ, అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేశారు. ఆర్మూర్‌ డివిజన్‌లో గురువారం నామినేషన్లకు చివరి రోజు అయినందున నామినేషన్ల దాఖలులో ఎటువంటి ఇబ్బందులు ...

Read More »

ఉచిత వైద్య శిబిరం

ఆర్మూర్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ ప్రాంతంలో గురువారం ఉచిత ఆర్తోపేడిక్‌ క్యాంప్‌ నిర్వహించారు. ఎముకలు, కీళ్లు, నరాల నిపుణులు డాక్టర్‌ సాహిత్‌ పటేల్‌ ఆద్వ్యర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. క్యాంప్‌ ద్వారా దాదాపు 200 మంది వివిధ వ్యాది గ్రస్తులు సేవలను వినియోగించుకున్నట్లు శ్రీ రామ ఆర్తోపెడిక్‌, ట్రామాకేర్‌ ఆసుపత్రి ఎండి ఎమ్‌.సాహిత్‌ పటేల్‌ వివరించారు.

Read More »

ఏకగ్రీవమైన ఎంపిటిసిలు

బాన్సువాడ, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ది ప్రదాత, తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆశీస్సులతో యువ నాయకులు దేశాయ్‌పేట సొసైటీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి ఆద్వర్యంలో బాన్సువాడ నియోజకవర్గంలోని పలు ఎంపిటిసి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కొన్నిచోట్ల పోటీదారులు ఉపసంహరించుకోవడం మరికొన్ని చోట్ల అధికార పార్టీ తరఫున ఒకే నామినేషన్‌ దాఖలు కావడంతో పోటీలేక ఎంపిటిసి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. బాన్సువాడ మండలంలోని స్పీకర్‌ సొంత గ్రామమైన పోచారం, కొన్నూరు, దేశాయ్‌పేట, తాడ్కోలు, బీర్కూర్‌ మండలంలోని బైరాపూర్‌, ...

Read More »