Breaking News

అన్ని వర్గాల సంక్షేమమే తెరాస ద్యేయం

బీర్కూర్‌, మే 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలోని అన్ని వర్గాల సంక్షేమమే తెరాస, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ద్యేయమని బీర్కూర్‌ మాజీ జడ్పీటీసీ ద్రోణావల్లి సతీష్‌ అన్నారు. మే 10న జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బీర్కూర్‌ ఆర్య వైశ్య సంఘంలో ప్రచారసభ ఏర్పాటు చేశారు.

అంతకు ముందు కుర్మ యాదవులు, ఎరుకలి సంఘం సభ్యులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసారని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌, పెట్టుబడి సహాయం కింద ఎకరానికి 10 వేలు, లక్ష రూపాయల లోపు పంట రుణాల మాఫీ, రైతాంగానికి సాగు నీటి ఇబ్బందులు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు, వికలాంగులకు 3వేల రూపాయలు, వితంతువులకు, వద్దులకు 2వేల రూపాయలు పింఛన్‌, తదితర పథకాలు దిగ్విజయంగా అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు.

10న జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి జడ్పీటీసీ అభ్యర్థి తనబుద్ది స్వరూప, బీర్కూర్‌ ఎంపీటీసీ 2 అభ్యర్థి సందీప్‌ పాటిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని, బీర్కూర్‌ గ్రామము, మండలాన్ని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అభివద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీర్కూర్‌ ఎంపీటీసీ 1 రఘు, మాజీ పిఏసిఎస్‌ ఛైర్మెన్‌ కొల్లి గాంధీ, నాయకులు అవారి గంగారాం, లాడేగమ వీరేశం, మాజీ సర్పంచ్‌ నర్సన్న, అంజగౌడ్‌, పోశెట్టి, శశికాంత్‌, పడితే నారాయణ, వైశ్య సంఘం అధ్యక్షులు వీరయ్య గుప్త, సంతోష్‌, సాయినాథ్‌, వీరేశం, రమేశ్‌, జగదీష్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *