Breaking News
రికార్డులను పరిశీలిస్తున్న ఆర్డీవో గోపిరామ్‌

రైతుల సమస్యలు సత్వరమే పరిష్కరిస్తాం

రెంజల్‌, మే 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో భూ ప్రక్షాళనలో జరిగిన పొరపాట్లు, పాసుపుస్తకాలలో పేర్లు మార్పిడి, భూమి హెచ్చు తగ్గుల గురించి నిత్యం కార్యాలయాల చుట్టూ తిరిగే రైతులకు ఇబ్బందులు కలుగకుండా నేరుగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల ద్వారా రైతుల సమస్యలు సత్వరమే పరిష్కరిస్తామని బోధన్‌ ఆర్డీవో గోపిరామ్‌ అన్నారు.

శనివారం రెంజల్‌ తహసీల్దార్‌ కార్యక్రమంలో భూ రికార్డుల ప్రక్షాళనకు సంబంధించిన వివరాలను తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. మండలంలో 95 శాతం భూ రికార్డుల ప్రక్షాళన పనులు పూర్తయ్యాయని తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌ తెలిపారు. పెండింగులో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించి వంద శాతం పనులు పూర్తి చేయాలని ఆర్డీవో సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ సాయిలు, విఆర్వోలు ఉన్నారు.

Check Also

27న మాస్కుల‌ పంపిణీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *