Breaking News

ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి

ఆర్మూర్‌, మే 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలకు, విద్యార్థుల బలవన్మరణాలకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్‌ చేయాలని, గ్లోబరీనా సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టి యాభై కోట్లు జరిమానా వేసి ఆ మొత్తాన్ని బాదిత కుటుంబాలకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర విద్యార్థి యువజన సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ పిలుపు మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఎంపి, ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడించే ప్రయత్నం చేశారు.

ఇందులో భాగంగా ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంటిని ముట్టడించడానికి కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. అనంతరం సొంత పూచికత్తుపై విడిచిపెట్టారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *