Breaking News

పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ పూర్తి

నిజామాబాద్‌, మే 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మొదటి విడత లో జరుగు నిజామాబాద్‌ డివిజన్‌ ఎంపీటీసీ జెడ్‌పిటిసి ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ సిబ్బంది ర్యాండ మైజెషన్‌ (నియామక) ప్రక్రియ జిల్లా పరిశీలకులు అభిలాష్‌ బిస్ట్టు సమక్షంలో జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు పూర్తి చేశారు. మొదటి విడత చివరి ర్యాండమైజేషన్‌ కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నిజామాబాద్‌ జిల్లాలో మొదటి విడత నిజామాబాద్‌ డివిజన్లో 8 జడ్పిటిసిలకు ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహణ కోసం 538 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

117 పోలింగ్‌ కేంద్రాలు 400 లోపు ఓటర్లు గలరని, 421 పోలింగ్‌ కేంద్రాల్లో 400 పైబడి ఓటర్లు ఉన్నారని, 400 లోపు ఓటర్ల గల 117 పోలింగ్‌ కేంద్రాలలో ఒక పిఓ ఒక ఏపీఓతో పాటుగా మరో ముగ్గురు పోలింగ్‌ సిబ్బందిని, 400 పైబడిన ఓటర్లు గల 421 పోలింగ్‌ కేంద్రాలలో ఒక పిఓ ఒక ఏపీఓ, మరో నలుగురు పోలింగ్‌ సిబ్బంది చొప్పున నియమించినట్టు కలెక్టర్‌ వివరించారు. అదనంగా 20 శాతం కలుపుకొని 646 పివోలు మరో 646 ఏపీఓలు 2442 పోలింగ్‌ సిబ్బంది నియమించినట్లు జిల్లా కలెక్టర్‌ పరిశీలకులకు వివరించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వేణు, డిప్యూటీ సీఈఓ గోవిందు తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *