Breaking News

తెరాస అభ్యర్థులను గెలిపించండి

బాన్సువాడ, మే 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎంపిటిసి, జడ్పిటిసిలను అధిక మెజార్టీతో గెలిపించాలని బాన్సువాడ నియోజకవర్గ తెరాస నాయకులు పోచారం సురేందర్‌రెడ్డి కోరారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గంలోని చందూరు మండలం కారేగాం, లక్ష్మాపూర్‌, మేడిపల్లి, లక్ష్మిసాగర్‌ తాండా తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పోటీలో పాల్గొంటున్న అభ్యర్థుల తరఫున ఆయన ప్రజలను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *