Daily Archives: May 6, 2019

వడదెబ్బతో రైతు మృతి

మోర్తాడ్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలోని పాలెం గ్రామానికి చెందిన ఏలేటి రాజేశ్వర్‌ (51) అనే రైతు వడదెబ్బతో మృతి చెందినట్టు గ్రామ పట్వారీ రాజేశ్వర్‌రెడ్డి సోమవారం తెలిపారు. రాజేశ్వర్‌ ఆదివారం కల్లంలో ఆరబెట్టిన వరిధాన్యం వద్ద పనిచేయడం వల్ల ఎండదెబ్బ తగలడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్టు చెప్పారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇదిలా ఉండగా రాజేశ్వర్‌కు ఐదు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో గుండెకు శస్త్ర చికిత్స జరిగిందని సమాచారం. ...

Read More »

పోలింగ్‌ ప్రశాంతం

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ డివిజన్లో జడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. నిజామాబాద్‌ డివిజన్లో జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. 8 జడ్పిటిసిలకు గాను ఒకటి ఏకగ్రీవం కాగా మిగతా ఏడు జడ్పిటిసిలకు, 100 ఎంపీటీసీలకు గాను ఆరు ఎంపీటీసీలు ఏకగ్రీవం కాగా 94 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్‌ను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్‌ ...

Read More »

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలి

బీర్కూర్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని, 10 వతేదీన జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెరాస బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ జడ్పీటీసీ ద్రోణావల్లి సతీష్‌ కార్యకర్తలనుద్దేశించి అన్నారు. సోమవారం బీర్కూర్‌లో కార్యకర్తల సమేవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తేదీన జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు గెలుపునకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కార్యకర్తలకు తెలియజేసారు. తెరాస పార్టీ ...

Read More »

7న బసవేశ్వర జయంతి

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మ బసవేశ్వర జయంతిని పురస్కరించుకుని ఈనెల 7న జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఒక ప్రకటనలో తెలిపారు. జయంతి కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో 7 వతేదీ మంగళవారం ఉదయం 10:30 గంటలకు నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా వీరశైవ లింగాయతులు, వారి సంబంధిత వర్గాల వారు, అభిమానులు ఆసక్తి కలవారు, జిల్లా అధికారులు ఉద్యోగులు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కలెక్టర్‌ ప్రకటనలో కోరారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ...

Read More »

వెబ్‌కాస్టింగ్‌ పరిశీలన

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ డివిజన్లో జరుగు ఎంపీటీసీ జెడ్‌పిటిసి ఎన్నికలలో ఎన్నిక సరళిని పరిశీలించేందుకు ప్రగతిభవన్లో ఏర్పాటుచేసిన వెబ్‌ కాస్టింగ్‌ను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు సోమవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా 49 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క తొలి కేంద్రం ఓపెన్‌ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 135 సున్నిత అతి సున్నిత పోలి కేంద్రాలుగా పోలీసు శాఖ గుర్తించినందున అలాంటి కేంద్రాలలో ఏలాంటి ...

Read More »

ప్రశ్నించే గొంతుకలకు అవకాశమివ్వాలి

రెంజల్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌:ప్రాదేశిక ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకలైన ప్రతిపక్షాలకు అవకాశమివ్వాలని బీజేపీ మండల అధ్యక్షుడు మేక సంతోష్‌ కోరారు. మండలంలోని బొర్గం, సాటాపూర్‌, తాడ్‌బిలోలి గ్రామాల్లో సోమవారం జడ్పీటిసి అభ్యర్థి విజయ, ఎంపీటీసీ అభ్యర్థులు రుక్మిణీ, గోపికష్ణ, రూపలను గెలిపించాలని కోరుతూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో మోడీ, గ్రామాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తాము చేసినమంటూ గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. గల్లీ ...

Read More »

ఉద్యోగుల సంక్షేమ నిధి నుండి రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగుల సంక్షేమ నిధి నుండి వైద్యం, విద్య కారణాలపై రుణాలకు ఉద్యోగుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా ట్రెజరీ ఉప సంచాలకులు రామ్మోహన్‌ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. 4వ తరగతి ఉద్యోగులు, ఎన్జీవోలు రుణాలకు అర్హులని, అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌ లేదా సివిల్‌ సర్జన్‌ నుండి ధ్రువ పత్రం పొందిన వారు వైద్య కారణాలపై రుణాలకు, అదేవిధంగా సంబంధిత పాఠశాల నుండి ఫీజుకు సంబంధించి ధవ పత్రం సమర్పించి విద్యా రుణాలు ...

Read More »

జోరుగా టిఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం

రెంజల్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామంలో సోమవారం టిఆర్‌ఎస్‌ ఎంపీటీసీ అభ్యర్థి చింతకుంట లక్ష్మీకి మద్దతుగా టిఆర్‌ఎస్‌ నాయకులు జోరుగా ప్రచారం నిర్వహించారు. ఉపాధిహామీ పనులు చేపడుతున్న కూలీల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. గ్రామంలో అభివద్ధి పనులు పూర్తి స్థాయిలో చేపట్టాలంటే అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎంపీటీసీ అభ్యర్థి లక్ష్మీ మాట్లాడుతూ ఓటర్లు ఆశీర్వదించి గెలిపిస్తే తాడ్‌బిలోలి గ్రామాన్ని ఎమ్మెల్యే షకీల్‌ సహకారంతో మరింత అభివద్ధికి కషి ...

Read More »

ఎమ్మెల్యే సహకారంతో మండలాభివృద్ది చేస్తా

జడ్పీటీసీ అభ్యర్థి శోభ ధపెదార్‌ రాజు నిజాంసాగర్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌ నియోజక వర్గంలో నిజాంసాగర్‌ జడ్పీటీసీ అభ్యర్థి శోభ ధపెదార్‌ రాజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జడ్పీటీసీ అభ్యర్థి శోభకు పలు గ్రామాలలో ప్రజల నుండి మద్దతు లభిస్తుంది. ఉమ్మడి జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా నిజాంసాగర్‌ మండలాన్ని అభివద్ధి పర్చిన ధపెదార్‌ రాజుకు గ్రామ గ్రామన ప్రజలు స్వాగతం పలుకుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటువేయాలని తెలిపారు. నిజాంసాగర్‌ మండలంలో ...

Read More »

తెలంగాణ అభివృద్ది దేశానికే దిక్సూచి

ఎంపి కవిత నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత సోమవారం జరిగిన జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌ నియోజక వర్గం నవిపేట మండలంలో తన స్వగ్రామం పొతంగల్‌లోని స్కూల్‌లో ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎంపి ఎన్నికల్లో మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వార్‌ వన్‌ సైడే అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నూ ప్రతి గ్రామంలో గులాబీ ...

Read More »