కామారెడ్డి, మే 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో 7 ఎంఎల్ఎస్ పాయింట్లు కూడా ప్రయివేటు గోదాములో నిర్వహిస్తున్నారని, కార్మికులకు కనీస సౌకర్యాలు లేకుండా ఎండలో సైతం కార్మికులు పనిచేస్తున్నారని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఎల్.దశరథ్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏఐటియుసి కార్యాలయంలో సివిల్ సప్లయ్ హమాలీల జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దశరథ్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద కనీసం నీళ్లు, మరియు మరుగుదొడ్లు లేక కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ...
Read More »Daily Archives: May 11, 2019
టీకా వికటించి బాలుని మృతి
కామారెడ్డి, మే 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో టీకా వికటించి 45 రోజుల వయసుగల బాలుడు మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీలో నివాసముంటున్న సాయికుమార్, ఉమలకు ఇద్దరు బాబులు. పెద్దబాబు కన్నయ్య, 45 రోజుల చిన్నబాబుకు నెలసరి టీకా ఇప్పించేందుకు కాలనీలోని అంగన్వాడి కేంద్రానికి మధ్యాహ్నం తీసుకెళ్లారు. ఇంజక్షన్ ఇప్పించి ఇంటికి రాగా సాయంత్రం 5 గంటల సమయంలో బాబు ఉలుకు పలుకు లేకుండా అచేతనంగా పడిఉండడంతో ప్రయివేటు ఆసుపత్రికి ...
Read More »బోధస్ గోపాల్ మృతిపై విచారణ జరపాలి
కామారెడ్డి, మే 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధస్ గోపాల్ కొనుగోలు కేంద్రం వద్ద సిబ్బంది ఒత్తిడి వల్లే వడదెబ్బ తగిలి మరణించాడని, ఆయన కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలని తెలంగాణా రాష్ట్ర రైతు సంఘము ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం లక్ష్మపూర్ పంచాయితి పరిధిలోని కొట్టథాని చెందిన బోధస్ గోపాల్ (48) ధాన్యాన్ని ...
Read More »వీరబ్రహ్మేంద్ర స్వామివారి జీవిత చరిత్ర
నేటి నుంచి గురుపూజ మహోత్సవాలు హైదరాబాద్, మే 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతదేశంలో కాలజ్ఞానం, కాలజ్ఞాన తత్వాల గురించి తొలిసారిగా చెప్పిన యోగి. సంఘసంస్కర్త. ఎవరూ చెప్పడానికీ, పేర్కొనటానికి సాహసించని మరో పర్యాయపదం ఆయన హేతువాది. ప్రపంచంలో ఏ వింత జరిగినా ‘బ్రహ్మంగారు ఆనాడే చెప్పారు’ అంటూ ప్రజలు నేటికీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. ఆయనే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. నిజమవుతున్నాయి. మరి బ్రహ్మంగారి మఠంలో ఏం జరుగుతోంది..? తాళపత్ర ...
Read More »జ్యూవెల్లరీ షాప్‌లో అగ్నిప్రమాదం
రెంజల్, మే 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని సాటాపూర్ గ్రామంలోని రుద్ర జ్యూవెల్లరీ షాప్‌లో శనివారం ఉదయం షాట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షాపులోగల విలువైన వస్తువులు దగ్దమవ్వడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైరింజన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. జ్యూవెల్లరీ షాప్‌లో ఎగసిపడుతున్న మంటలు ఘటనా స్థలానికి ఫైర్ ఎస్సై ప్రవీణ్ కుమార్ చేరుకుని షాట్ సర్క్యూట్‌కు గల కారణాలు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంచనామా నిర్వహించి సుమారు రూ.50 వేల ఆస్తినష్టం జరిగినట్లు ...
Read More »గెలిపించండి అభివద్ధి చేస్తాం
ఎమ్మెల్యే హన్మంత్‌షిండే నిజాంసాగర్, మే 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా చిన్న కొడప్గల్ జడ్పీటీసీ అభ్యర్థి అన్నారం వెంకట్ రాంరెడ్డి, ఎంపీటీసీ బోయిని రుక్మిణి బాయీని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ హన్మంత్ షిండే కోరారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ టిఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే అభివద్ధి జరుగుతుందని అన్నారు. కెసిఆర్ పాలనలోనే గ్రామాల అభివద్ధి జరిగిందన్నారు. 70 సంవత్సరాలలో జరగని అభివద్ధి ఐదు సంవత్సరాలలో చేసి చూపించారన్నారు. ఆడపడుచుల ...
Read More »అంగన్వాడికి తాళం : ఉపాధి బాటలో టీచర్
నిజాంసాగర్, మే 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చిన్నారులకు ఆటపాటలతో అఆలు నేర్పుతు, పౌష్టికాహారం అందించాల్సిన ఓ అంగన్వాడి టీచర్ విదులకు హాజరు కాకుండా కేంద్రానికి తాళం పెట్టారు. కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్ మండలంలోని జక్కాపూర్ గ్రామములో అంగన్ వాడి కేంద్రానికి తాళం వేసి విదులకు డుమ్మా కొట్టారు అంగన్వాడి టీచర్ సాయవ్వ. అంతటితో ఊరుకోక కేంద్రం నడపాల్సిన సమయంలోనే ఉపాధి పనులు చేస్తు నిజామాబాద్ న్యూస్ కంటపడ్డారు. ఇష్టారాజ్యంగా నడిపిస్తున్న అంగన్వాడి సెంటర్లపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
Read More »తెలంగాణ ఆత్మగౌరవ కవి డాక్టర్ సామల సదాశివ
నిజామాబాద్, మే 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామల సదాశివ తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన కవి అని, ఆయన చూపిన మార్గం తెలంగాణ భాషకు గొప్ప స్థితిని తీసుకు వచ్చిందని తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. ఆయన శనివారం కేర్ డిగ్రీ కళాశాలలో డాక్టర్ సామల సదాశివ జయంతి సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. డాక్టర్ సామల సదాశివ అనువాద సాహిత్యంలో చేసిన కషి ఎంతో గొప్పదని, రూబాయిల ప్రక్రియను తెలంగాణ సాహిత్యంలో గొప్ప స్థాయిలో నిలబెట్టారని ...
Read More »అరుణోదయ రామారావు సంతాపసభ
నిజామాబాద్, మే 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ అరుణోదయ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అరుణోదయ రామారావు సంతాప సభ శనివారం జిల్లా ఉపాధ్యక్షులు దాసు అధ్యక్షతన స్థానిక ఎన్.ఆర్ భవన్ లో జరిగింది. సభలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.గంగాధర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కర్నాటి యాదగిరి, వనమాల కష్ణ, వి.ప్రభాకర్, ఆకుల పాపయ్య, ప్రముఖ రచయిత సిహెచ్ మధు, కవి పడాల రామారావు. దండి వెంకటి, బిఎన్బి, ప్రజా గాయకులు సిరప లింగం, అష్టగంగాధర్, ...
Read More »