Breaking News
ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే హన్మంత్‌షిండే

గెలిపించండి అభివద్ధి చేస్తాం

ఎమ్మెల్యే హన్మంత్‌షిండే

నిజాంసాగర్‌, మే 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా చిన్న కొడప్‌గల్‌ జడ్పీటీసీ అభ్యర్థి అన్నారం వెంకట్‌ రాంరెడ్డి, ఎంపీటీసీ బోయిని రుక్మిణి బాయీని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ హన్మంత్‌ షిండే కోరారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే అభివద్ధి జరుగుతుందని అన్నారు. కెసిఆర్‌ పాలనలోనే గ్రామాల అభివద్ధి జరిగిందన్నారు. 70 సంవత్సరాలలో జరగని అభివద్ధి ఐదు సంవత్సరాలలో చేసి చూపించారన్నారు.

ఆడపడుచుల కోసం మిషన్‌ భగీరథ నీటి ద్వారా ఇంటింటికీ నల్ల బిగించి నీళ్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో వ ద్ధులకు వికలాంగులకు 200 రూపాయలు పింఛన్‌ ఇచ్చేవారని, టిఆర్‌ఎస్‌ పాలనలో 200 రూపాయల పింఛన్‌ను వద్ధులకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. త్వరలో పెన్షన్లను పెంచడం జరుగుతుందని పేర్కొన్నారు. నిరుపేద ఆడపడుచుల కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను చేపట్టడం జరిగిందన్నారు. గ్రామాలలో, పట్టణాల్లో కేసీఆర్‌తోనే అభివద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమములో జడ్పీటీసీ ప్రతాప్‌ రెడ్డి, మాజీ మార్కెట్‌ చెర్మెన్‌ బాబు దొర, సర్పంచ్‌ శ్రీనివాస్‌ రెడ్డి, తెరాస నాయకులు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *