Breaking News
ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న ఫైర్‌ ఎస్సై ప్రవీణ్‌ కుమార్‌

జ్యూవెల్లరీ షాప్‌లో అగ్నిప్రమాదం

రెంజల్‌, మే 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాటాపూర్‌ గ్రామంలోని రుద్ర జ్యూవెల్లరీ షాప్‌లో శనివారం ఉదయం షాట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షాపులోగల విలువైన వస్తువులు దగ్దమవ్వడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైరింజన్‌ సహాయంతో మంటలను అదుపు చేశారు.

జ్యూవెల్లరీ షాప్‌లో ఎగసిపడుతున్న మంటలు

ఘటనా స్థలానికి ఫైర్‌ ఎస్సై ప్రవీణ్‌ కుమార్‌ చేరుకుని షాట్‌ సర్క్యూట్‌కు గల కారణాలు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంచనామా నిర్వహించి సుమారు రూ.50 వేల ఆస్తినష్టం జరిగినట్లు తెలిపారు. బాధితుడు ఆమోల్‌ పిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *