Breaking News
విలేకరులతో మాట్లాడుతున్న పశ్య పద్మ

బోధస్‌ గోపాల్‌ మృతిపై విచారణ జరపాలి

కామారెడ్డి, మే 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధస్‌ గోపాల్‌ కొనుగోలు కేంద్రం వద్ద సిబ్బంది ఒత్తిడి వల్లే వడదెబ్బ తగిలి మరణించాడని, ఆయన కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలని తెలంగాణా రాష్ట్ర రైతు సంఘము ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్‌ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం లక్ష్మపూర్‌ పంచాయితి పరిధిలోని కొట్టథాని చెందిన బోధస్‌ గోపాల్‌ (48) ధాన్యాన్ని విక్రయించేందుకు లక్షపూర్‌ కొనుగోలు కేంద్రానికి మే 2 న వెళ్ళాడని అప్పటినుంచి 15 రోజులు ధాన్యం కుప్ప వద్దనే కాపలా ఉన్నాడని, వడ దెబ్బ తగిలి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని ఆమె అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో సరైన వసతులు లేవని రెండు కాంటాలు మాత్రమే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఎండకు కనీసం పందిర్లు కూడా ఏర్పాటు చేయలేదని ధాన్యాల కాంటా అయిన తరువాత ధాన్యాన్ని తీసుకువెళ్లాడనికి లారిలు లేకపోవడం ధాన్యం కాంటా అయిన తరువాత కూడా బోధస్‌ గోపాల్‌ ధాన్యం వద్ద కాపలా ఉండాల్సి వచ్చిందన్నారు.

వరుసగా 15 రోజులు ధాన్యం విక్రయ కేంద్రంలో ఉండాల్సి వచ్చిందని తేమ శాతం 8,9 శాతం వచ్చేంత వరకు ఎండ పెట్టాలని వత్తిడి చేయడం తదితర కారణాలు వల్లనే వడ దెబ్బ తగిలి మరణించడాని కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు, రైతులందరు తెలంగాణ రైతు సంఘము నాయకులకు తెలిపారు. అలాగే రైతు కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. సమావేశంలో రైతు సంఘము జిల్లా అధ్యక్షుడు జూకంటి సుధాకర్‌, ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏసు రత్నం, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఎల్‌.దశరథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఉపాధి హామీ పనులు పరిశీలించిన అదనపు కలెక్టర్‌

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *