Breaking News

టీకా వికటించి బాలుని మృతి

కామారెడ్డి, మే 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో టీకా వికటించి 45 రోజుల వయసుగల బాలుడు మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌ కాలనీలో నివాసముంటున్న సాయికుమార్‌, ఉమలకు ఇద్దరు బాబులు. పెద్దబాబు కన్నయ్య, 45 రోజుల చిన్నబాబుకు నెలసరి టీకా ఇప్పించేందుకు కాలనీలోని అంగన్‌వాడి కేంద్రానికి మధ్యాహ్నం తీసుకెళ్లారు.

ఇంజక్షన్‌ ఇప్పించి ఇంటికి రాగా సాయంత్రం 5 గంటల సమయంలో బాబు ఉలుకు పలుకు లేకుండా అచేతనంగా పడిఉండడంతో ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాబు మృతి చెందాడని వైద్యులు చెప్పడంతో బారు రోదిస్తు అంగన్‌వాడి కేంద్రానికి బాబుకు తీసుకెళ్ళి నిలదీశారు. అంగన్‌వాడి సిబ్బందిని సరైన సమాధానం రాకపోగా డోసు ఎక్కువై ఉండొచ్చన్న నిర్లక్ష్యం సమాధానం ఇచ్చారు. దీంతో పసికందును పోగొట్టుకున్న తల్లిదండ్రులు రోదిస్తు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు డిమాండ్‌ చేశారు.

Check Also

ఉపాధి హామీ పనులు పరిశీలించిన అదనపు కలెక్టర్‌

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *