Breaking News

Daily Archives: May 15, 2019

రోడ్డు ప్రమాదంలో యువకుని దుర్మరణం

కామారెడ్డి, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌జిల్లా రామాయంపేట బైపాస్‌రోడ్డు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్‌కు చెందిన ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలపాలైనట్టు సమాచారం. పెళ్ళి పత్రికలు పంచేందుకు వెళ్ళిన వీరు బైక్‌పై వీడియో కాల్‌ మాట్లాడుతూ డ్రైవ్‌ చేస్తుండగా డివైడర్‌ను ఢీకొని సంఘటన స్థలంలోనే ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించారు. వీరి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More »

పుస్తె, మట్టెల వితరణ

కామారెడ్డి, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలో నిరుపేద వదువుకు బుధవారం పుస్తె, మట్టెలు వితరణ చేశారు. గ్రామానికి చెందిన గడ్డమీది భారతి, భూమయ్యల కుమార్తె గంగమణి వివాహానికి తెరాస పార్టీ నాయకుడు ఉడుదొండ నరేశ్‌ కుమార్‌ పుస్తె, మట్టెలు అందజేశారు. నిరుపేద కుటుంబానికి తనవంతుగా సహాయాన్ని అందించినట్టు తెలిపారు. ఆయన వెంట నవీన్‌, శ్రీకాంత్‌, ప్రశాంత్‌, నర్సింలు, నందు తదితరులున్నారు.

Read More »

ఆర్యవైశ్య మహాసభ నాయకుల ఎన్నిక

కామారెడ్డి, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, ఉపాధ్యక్షులను బుధవారం ఎన్నుకున్నారు. మహాసభ రాష్ట్ర అద్యక్షునిగా అమరవాణి లక్ష్మినారాయణ, ఉపాధ్యక్షునిగా కైలాస్‌ శ్రీనివాస్‌రావులు ఎన్నికయ్యారు. వీరిని సంఘం ప్రతినిధులు సత్కరించారు. నియామక పత్రాలు అందజేశారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతికి పాటుపడతామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

Read More »

హరితహారంపై యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలి

కామారెడ్డి, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొక్కలు నాటే కార్యక్రమంపై యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా, జిల్లా అటవీశాఖ ద్వారా సదాశివనగర్‌ మండలంలోని ధర్మారావుపేట, ఆమర్ల బండ నర్సరీల్లో 80 వేల మొక్కలు, మల్లుపేట నర్సరీలో లక్ష మొక్కల పెంపకాన్ని బుధవారం జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. సర్పంచ్‌లు తమ గ్రామాల్లో ఏఏ ప్రాంతాల్లో ఏఏ మొక్కలు నాటాలో కార్యాచరణ ప్రణాళిక తయారుచేసుకోవాలని చెప్పారు. ఇందుకోసం క్షేత్రస్థాయి సిబ్బంది ...

Read More »

ఎరువులు, మందుల విక్రయ దారులు రైతుకు సహకరించాలి

కామారెడ్డి, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు ఇబ్బంది పడకుండా పంటలు తెగుళ్ళ బారిన పడకుండా రైతుకు అధిక దిగుబడి వచ్చేలా సరైన క్రిమిసంహారక మందులు, ఎరువులు అమ్మి డీలర్లు రైతులకు దన్నుగా నిలవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. బుధవారం జనహితలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మొక్కజొన్నలో కత్తెర పురుగు, పత్తిలో గులాబిరంగు పురుగు, సమగ్ర యాజమాన్య పద్దతులపై కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్‌లకు చెందిన ఇన్‌పుట్‌ డీలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యవసాయ శాఖాధికారులు వర్షాకాలంలో ...

Read More »

ఘనంగా కుస్తీ పోటీలు

నిజాంసాగర్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలోని బంజపల్లి గ్రామంలో వీరభద్ర స్వామి ఆలయ ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 200 రూపాయల నుంచి ప్రారంభమైన కుస్తీ పోటీలు 300 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయల వరకు కొనసాగాయి. కుస్తీ పోటీలో పాల్గొనేందుకు మల్లయోధులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాలు భారీగా తరలివచ్చారు. నారాయణఖేడ్‌, నిజాంపేట్‌, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి మల్లయోధులు భారీగా తరలి వచ్చారు. విజేతలకు బహుమతి ...

Read More »

ఉపాధి కూలీలకు మినరల్‌ వాటర్‌ పంపిణీ

రెంజల్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కళ్యాపూర్‌ గ్రామంలో ఉపాధిహామీ పథకం ద్వారా పనులు చేపడుతున్న కూలీలకు తాగునీటి దాహాన్ని తీర్చేందుకు బుధవారం సర్పంచ్‌ నీరంజని మినరల్‌ వాటర్‌ పంపిణీ చేశారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున కూలీల దాహార్తిని తీర్చేందుకు చల్లని మినరల్‌ వాటర్‌ను పంపిణీ చేయడం జరిగిందని సర్పంచ్‌ నీరంజని తెలిపారు. కార్యక్రమంలో రైతుసమన్వయ సమితి మండల అధ్యక్షుడు కాశం సాయిలు, గ్రామ యువకులు భారత్‌, నవీన్‌, సతీష్‌ తదితరులు ఉన్నారు.

Read More »

కౌంటింగ్‌ స్టాఫ్‌కు రెండ్రోజుల శిక్షణ

నిజామాబాద్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోకసభ ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం తన ఛాంబర్‌ లో సంభందిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నియమించిన కౌంటింగ్‌ స్టాఫ్‌కు ఈ నెల 16, 17 తేదీలలో శిక్షణ తరగతులను ఏర్పాటు చేసి కౌంటింగ్‌ పూర్తి సన్నద్ధంగా ఉండే విధంగా తయారు చేయాలన్నారు. కౌంటింగ్‌ సందర్భంగా సిసి కెమెరాలు వీడియో గ్రాఫ్‌ చేయించాలని ...

Read More »

రెడ్‌క్రాస్‌లో రక్తదాన శిబిరం

నిజామాబాద్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందూరు బ్లడ్‌ డోనర్స్‌ గ్రూప్‌, రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిభిరం నిర్వహించారు. వేసవి కాలంలో తీవ్రగా ఉన్న రక్త కొరతను అధిగమించడానికి ఇందూరు బ్లడ్‌ డోనర్స్‌ గ్రూప్‌ నిర్వాహకులల్లో ఒకరైన రామకష్ణ ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్‌ నిజామాబాద్‌ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ప్రతి వేసవిలో రక్తం కొరత తీవ్రంగా ఉంటుందని అదే విధంగ ఇప్పుడు కూడా నిజామాబాద్‌లో రక్తం కొరత తీవ్రంగా ఉందని తెలుసుకుని ఇందూర్‌ బ్లడ్‌ ...

Read More »

23న కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తిచేయాలి

నిజామాబాద్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 23న జరుగు లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ సీఎంసిలో నిర్వహించనున్నందున కౌంటింగ్‌ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు. సీఎంసిలో నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఐదు నియోజకవర్గాలైన బాల్కొండ, ఆర్మూర్‌, నిజామాబాద్‌ అర్బన్‌, బోధన్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్‌ రూములకు వేసిన సీఎల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల కౌంటింగ్‌ గదులను పరిశీలించి ఏర్పాట్లను అతితొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్‌ ...

Read More »

నిలబడి నీళ్లు తాగుతున్నారా?

సాధారణంగా నీళ్లు నిలబడి త్రాగుతాం, కానీ చాలా డేంజర్‌ అంటూ ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. రోజుకి కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగితే మంచిదని తెలుసుగానీ, నీళ్లను నిలబడి తాగకూడదని చాలా మందికి తెలియదు. ఇలా నిలబడి నీళ్లు తాగితే ఆరోగ్యపరంగా చాలా దుష్ప్రభావాలు ఉంటాయని అంటున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. నీళ్లు నిలబడి తాగడం వల్ల కిడ్నీలకు నీరు అందదని, దాంతో కిడ్నీ, మూత్రాశయ సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నిలబడి త్రాగితే ఆహార నాళం ...

Read More »