Breaking News

ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత

హైదరాబాద్‌, మే 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ సినీ హాస్యనటుడు రాళ్లపల్లి (73) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని మ్యాక్స్‌క్యూర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. 850 కి పైగా చిత్రాల్లో నటించిన రాళ్ళపల్లి అసలు పేరు రాళ్లపల్లి నర్సింహారావు, 1979 లో ‘కుక్కకాటుకు చెప్పు దెబ్బ’తో సినీ రంగ ప్రవేశం చేశారు.

1945 ఆగస్టు 15న అనంతపురం జిల్లా కంబదూరులో రాళ్లపల్లి జన్మించారు. సీనియర్‌ నటుడు రాళ్లపల్లి మతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు.

Check Also

ఆరోగ్య సేవలపై జాయింట్‌ డైరెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత సమావేశ మందిరంలో శనివారం మాతా శిశు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *