Breaking News
వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌

కౌంటింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ నిర్వహించుకోవాలి

కామారెడ్డి, మే 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా కౌంటింగ్‌ సిబ్బంది నియామకం, శిక్షణ సిబ్బంది ర్యాండమైజేషన్‌ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లకు తెలిపారు. శుక్రవారం ఆయన జిల్లాకలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల కౌంటింగ్‌పై సమీక్షించారు.

స్ట్రాంగ్‌ రూం నుంచి కౌంటింగ్‌ హాలుకు బ్యాలెట్‌ బాక్సులు తీసుకొచ్చే దారిలో, కౌంటింగ్‌ హాలులో నిబందనల ప్రకారం బ్యారికేడింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కౌంటింగ్‌ నిర్వహణపై ప్రజెంటేషన్‌ కార్యక్రమం జరిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, సిపివో శ్రీనివాస్‌, ఎన్నికల లైజనింగ్‌ అధికారి సాయన్న, జిల్లా పంచాయతీ అధికారి నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *