Breaking News

తూకంలో మోసం చేయొద్దు

కామారెడ్డి, మే 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ అధికారులు రైతులను 40 కిలోల బస్తాకు 2 నుంచి 5 కిలోలు తన పేరుతో తూకంలో మోసం చేస్తున్నారని, ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులకు ప్రభుత్వం తూకం పేరుతో మోసం చేయడం మానుకోవాలని ఎంసిపిఐ పార్టీ కామారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్‌ చేస్తుందని జిల్లా కార్యదర్శి రాజలింగం తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల ప్రకారం 40 కిలోల బస్తా తూకంలో గోనిబస్తా అరకిలో ఉంటుందని దీన్ని మాత్రమే తూకం నుండి మినహాయించి రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి లెక్కకట్టి ఇవ్వాలని, ఇందుకోసం ప్రభుత్వ ఉన్నతాధికారులు కిందిస్థాయి వ్యవసాయ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మోసపోతున్న తీరుపై ప్రత్యక్ష పరిశీలన నిమిత్తం రేపటినుండి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంసిపిఐ పార్టీ బందం పరిశీలించడానికి వెళ్లనున్నట్లు తెలిపారు.

ఎక్కడైనా రైతులను మోసం చేసినట్లు తేలితే అక్కడే ఆందోళన కార్యక్రమానికి పూనుకుంటామని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు స్వామి, రాజు, నరేష్‌, రాజశేఖర్‌, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *