Breaking News

Daily Archives: May 21, 2019

ప్రమాద స్థలాల పరిశీలన

కామారెడ్డి, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం దేవునిపల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను రూరల్‌ సిఐ భిక్షపతి, ఎస్‌ఐ శ్రీకాంత్‌, ఎన్‌హెచ్‌ఏఐ సిబ్బంది సందర్శించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలు గుర్తించామని, ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Read More »

ఆలయ విగ్రహం తరలింపుపై ఉద్రిక్తత

కామారెడ్డి, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని కాకతీయ నగర్‌ కాలనీలోని ఆలయం నుంచి మునిసిపల్‌ అధికారులు హనుమాన్‌ విగ్రహాన్ని తరలించడంపై వివాదం నెలకొంది. ఇది ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఓపెన్‌ స్థలంలో విగ్రహం పెట్టడంతోనే విగ్రహాన్ని తరలించామని మునిసిపల్‌ అధికారులు చెబుతున్నారు. గతంలో దేవునిపల్లి గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు తీసుకున్నా దాని కూల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సహకారం, మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ ప్రోత్సాహం, ప్రోద్బలంతోనే విగ్రహాన్ని తరలించారని స్థానికులు, భజరంగ్‌దళ్‌ నాయకులు ...

Read More »

భూసార పరీక్షల ఆధారంగా రైతులకు అవగాహన కల్పిస్తాం

కామారెడ్డి, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ సుస్థిర వ్యవసాయ విధాన పథకంలో భాగంగా జిల్లాలోని ప్రతి మండలంలో ఓ గ్రామాన్ని ఎంపిక చేసి గ్రామంలో ప్రతి పొలం నుంచి మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు నిర్వహించి దానికనుగుణంగా ఎరువుల ఉపయోగం, పంటల సాగుపై రైతులకు వివరిస్తామని సంయుక్త వ్యవసాయ సంచాలకులు రాములు అన్నారు. మంగళవారం జనహితలో పథకం అమలుపై ఎంపిక చేసిన గ్రామాల వ్యవసాయ విస్తీర్ణాధికారులకు, జిల్లా వ్యవసాయాధికారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, ...

Read More »

108లో మహిళ ప్రసవం

కామారెడ్డి, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్‌ తాండాకు చెందిన ఎం.దుర్గమణి మంగళవారం 108 వాహనంలో ప్రసవించి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్టు 108 ఇఎంటి కృష్ణస్వామి, పైలట్‌ రామశంకర్‌ తెలిపారు. మంగళవారం వేకువజామున 5.40 గంటలకు 108కు సమాచారం రాగా హుటాహుటిన గ్రామానికి చేరుకొని అంబులెన్సులో గర్భిణీని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా నొప్పులు తీవ్రమై మార్గమధ్యంలోనే ప్రసవమైనట్టు వివరించారు. ఈ సందర్భంగా అంబులెన్సు సిబ్బందికి దుర్గమణి బంధువులు కృతజ్ఞతలు ...

Read More »

నకిలీ విత్తనాలు విక్రయించొద్దు

డిఎస్‌పి లక్ష్మినారాయణ కామారెడ్డి, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విత్తన డీలర్లు రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి డిఎస్‌పి లక్ష్మినారాయణ హెచ్చరించారు. మంగళవారం విత్తనాల, ఎరువుల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు డీలర్లను నమ్ముకొనే సాగుబడి చేస్తారని, అలాంటి రైతులకు డబ్బులకు ఆశపడి నకిలీ విత్తనాలు విక్రయిస్తే అవి మొలకెత్తక రైతులు అప్పుల పాలవుతారని, అది మంచిది కాదని పేర్కొన్నారు. డబ్బుకు ఆశపడి అలాంటి పనులుచేయొద్దని పేర్కొన్నారు. ...

Read More »

కాంగ్రెస్‌ ఆద్వర్యంలో రాజీవ్‌గాంధి వర్ధంతి

కామారెడ్డి, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి నిర్వహించారు. రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజీవ్‌ ప్రధానిగా దేశానికి చేసిన సేవలను కొనియాడారు. యువకులకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని, ఢిల్లీ నుంచే నేరుగా గ్రామ పంచాయతీలకు జవహార్‌ రోజ్‌గార్‌ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామాల అభ్యున్నతికి పాటుపడ్డారని పేర్కొన్నారు. తమిళనాడులో ఉగ్రవాదుల మానవబాంబు దాడిలో ప్రాణాలర్పించారని చెప్పారు. ...

Read More »

గొలుసు దొంగల ముఠా అరెస్టు

ఆర్మూర్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని గ్రామాల్లో ఒంటరిగా ఆటోల్లో ప్రయాణించే మహిళల్ని లక్ష్యంగా చేసుకొని వారిమెడలోని బంగారు పుస్తెల తాళ్ళు, బంగారు గొలుసులను లాక్కునివెళ్లే ముఠాను మంగళవారం మాక్లూర్‌ ఎస్‌ఐ తమ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి నిజామాబాద్‌ రూరల్‌ సిఐ శ్రీనాథ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఒంటరి మహిళలు ప్రయాణిస్తున్న ఆటోలను నిర్మానుష్య ప్రాంతాల్లో ఆపి వారి మెడలోని బంగారు ఆభరణాలను ఎత్తుకు పోతున్నట్టు చెప్పారు. మహారాష్ట్రకు చెందిన గణేశ్‌, విశాల్‌, ...

Read More »

ప్రాజెక్టుపై ప్రయాణమా.. భద్రం… ఎక్కడా…?

నిజాంసాగర్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు కట్టపై గల మూల మలుపుల వద్ద నీటి పారుదలశాఖ అధికారులు రేడియం స్టిక్కర్‌లతో కూడిన సూచిక బోర్డులు ఏర్పాటుచేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు మహారాష్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. తిరుగు ప్రయాణంలో ప్రాజెక్టు కట్టపై నుంచి గమ్యస్థానాలకు చేరుకుంటారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు కట్టపై నుంచి మెదక్‌, సంగారెడ్డి జిల్లా మాసన్‌ పల్లి ఎక్స్‌రోడ్డుకు వెళ్లేందుకు ఘాట్‌ ...

Read More »

ఘనంగా బోనాల పండుగ

నిజామాబాద్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మాయ గ్రామంలో మంగళవారం ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. అందంగా ముస్తాబు చేసిన బోనాలను పోచమ్మ, ఎల్లమ్మ పేరుతో ప్రతి ఇంటినుంచి తీసుకొచ్చి ఎల్లమ్మ పోచమ్మ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. 22న బుధవారం కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్‌ కమ్మరి కథ అంజయ్య తెలిపారు. గ్రామ దేవతల జాతర, ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Read More »

కౌంటింగ్‌ కేంద్రంలోకి గుర్తింపు కార్డు తప్పనిసరి

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభ్యర్థులు కానీ వారి ఏజెంట్స్‌ కాని గుర్తింపు కార్డు ఉంటేనే కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌, నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి రామ్మోహన్‌ రావు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో పార్లమెంట్‌ నియోజకవర్గ పోటీ చేస్తున్న అభ్యర్థుల ఏజెంట్లతో ఎన్నికల కౌంటింగ్‌పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభ్యర్థులకు కానీ వారి అనుమతి పొందిన ఏజెంట్లు కానీ జిల్లా ఎన్నికల ...

Read More »

కౌంటింగ్‌ పరిశీలకులు వీరే

నిజామాబాద్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 23న జరుగు లోకసభ ఓట్ల లెక్కింపు పరిశీలన కోసం భారత ఎన్నికల సంఘం అబ్జర్వర్లు నియమించినట్లు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు కౌంటింగ్‌ పరిశీలకులను నియమించారు. ఆర్మూర్‌, బోధన్‌ నియోజకవర్గ ప్రస్తుత సాధారణ పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న గౌరవ్‌ దహియ కౌంటింగ్‌ పరిశీలకులు నియమించారు. నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌, బాల్కొండ నియోజకవర్గాలకు అమరేంద్ర బారువ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాలకు భావని రక్‌వల్‌ ...

Read More »

ఓట్ల లెక్కింపుపై రాష్ట్ర పరిశీలకుల సమీక్ష

నిజామాబాద్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 23న జరుగు పార్లమెంట్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు భారత ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన ప్రకారంగా ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు వెల్లడించారు. భారత ఎన్నికల కమిషన్‌ కౌంటింగ్‌ రాష్ట్ర పరిశీలకులుగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి వినోద్‌ జుత్‌షి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌ కుమార్‌తో కలిసి జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్‌ అధికారులతో హైదరాబాద్‌ నుండి కౌంటింగ్‌ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్‌ మంగళవారం నిర్వహించారు. ఈ ...

Read More »

మాక్‌ కౌంటింగ్‌ పూర్తి

నిజామాబాద్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి మాక్‌ కౌంటింగ్‌ను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఆధ్వర్యంలో పూర్తి చేశారు. ఈ నెల 23న లోక్‌సభ ఎన్నికకు సంబంధించి కౌంటింగ్‌ జరగనున్నందున మంగళవారం డిచ్‌పల్లి సిఎంసి కళాశాలలో మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌, నిజామాబాద్‌ లోక్‌సభ రిటర్నింగ్‌ అధికారి రామ్మోహన్‌ రావు సమక్షంలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కంప్యూటర్ల ద్వారా మాక్‌ కౌంటింగ్‌ నిర్వహించారు. మాక్‌ కౌంటింగ్‌ జరుగుతున్న విధానాన్ని ఏఆర్‌వోలు నిశితంగా పరిశీలించాలని ఎక్కడైనా ...

Read More »