Breaking News

గంజాయి స్వాధీనం : నిందితుల అరెస్టు

కామారెడ్డి, మే 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహారాష్ట్ర ప్రాంతానికి రైలులో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఏసి ఎన్‌ఫోర్సుమెంటు ఆదేశాల మేరకు ఎక్సైజ్‌ సిఐ అనంతయ్య నేతృత్వంలో శుక్రవారం కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను పట్టుకొని తనిఖీ చేశారు. వారి వద్దనుంచి పదికిలోల డ్రై గంజాయిని, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒకరు జుక్కల్‌ మండలం పోచారం తాండాకు చెందిన పడ్వల్‌ రూపా కాగా మరొకరు గాంధారి మండలం దుర్గంకు చెందిన బస్సీ గులాబ్‌సింగ్‌ను అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు.

గంజాయిని నారాయణఖేడ్‌ నుంచి కొనుగోలు చేసి దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ ద్వారా ముంబయికి అక్రమంగా తరలిస్తుంటారని పేర్కొన్నారు. గంజాయిని మిషన్‌తో ప్యాకింగ్‌ చేసి ప్యాకెట్‌పై సెంటు చల్లి వాసన రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఇద్దరిని అరెస్టు చేసి గంజాయి, బైకులను స్వాధీనం చేసుకొని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచనున్నట్టు పేర్కొన్నారు. దాడుల్లో ఎక్సైజ్‌ ఎస్‌ఐ జగన్‌మోహన్‌, సిబ్బంది నారాయణరెడ్డి, రాజన్న, అవనీష్‌, సందీప్‌, స్వరూప, రాంబచన్‌, శ్రీను ఉన్నారు.

Check Also

సిఎంను కలిసిన కామారెడ్డి జడ్పి చైర్మన్‌ శోభ రాజు

నిజాంసాగర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ శోభ రాజు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *