Breaking News

మొక్కల సంరక్షణ బాధ్యత చేపట్టాలి

కామారెడ్డి, మే 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు మొక్కలునాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం వాటరింగ్‌ డే సందర్భంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో ఆయన నీటిని పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని దాన్ని బాధ్యతగా తీసుకోవాలని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, నూతనంగా నియమితులైన అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, సిపివో శ్రీనివాస్‌, డిపివో నరేశ్‌, కలెక్టరేట్‌ ఏవో పద్మారావు, ఏపిడి సాయన్న తదితరులు పాల్గొన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *