Breaking News

Daily Archives: May 27, 2019

తెలంగాణ అభివద్ధి కోసం నిరంతరం పనిచేస్తా

కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అభివద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బంగారు తెలంగాణ కోసం కలిసి పనిచేద్దామని, ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమన్నారు. నిజామాబాద్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇటీవల మతి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త కిశోర్‌ కుటుంబాన్ని కవిత సోమవారం పరామర్శించారు. కిశోర్‌ మరణం టీఆర్‌ఎస్‌ పార్టీకి తీరని లోటన్నారు. కిషోర్‌ కుటుంబానికి అండగా ఉంటామని, టీఆర్‌ఎస్‌ పార్టీ కిశోర్‌ కుటుంబానికి అండగా ...

Read More »

ఆర్‌టిఐ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

కామారెడ్డి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిలభారతీయ ప్రజాసేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆద్వర్యంలో సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ జిల్లా అధ్యక్షుడు అంకం శ్యాంరావు మాట్లాడుతూ రక్తదానం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చన్నారు. ప్రతి ఒక్కరు రక్తదానం పట్ల అపోహలు తొలగించుకొని ప్రతి మూడునెలలకోసారి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిదులు రాంరెడ్డి, నరేశ్‌, అలీమోద్దీన్‌, ...

Read More »

భూ రికార్డుల పెండింగ్‌ సమస్యలు వందశాతం పూర్తిచేయాలి

కామారెడ్డి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా ప్రతీ రెవెన్యూ గ్రామ పంచాయతీలో పురోగతిలో, పెండింగ్‌లో ఉన్న ఖాతాలను సరిచేసి వందశాతం వాటిని నమోదు చేయాలని కామారెడ్డి కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. జనహితలో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా మండలాల వారిగా రెవెన్యూరికార్డుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ నమోదును ప్రత్యేక రిజిష్టార్‌లలో చేసి గ్రామ రెవెన్యూ అధికారి, తహసీల్దార్‌, ఆర్డీవో సమాచారాన్ని తమ వద్దఉంచుకోవాలని చెప్పారు. పౌతీ కేసులు, ...

Read More »

ప్రజావాణిలో 17 పిర్యాదులు

కామారెడ్డి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి 17 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. గృహ నిర్మాణ శాఖ,2, గిరిజన శాఖ-1, డిపివో 1, ఎంఎల్‌ 2, విద్యాశాఖ 2, విద్యుత్‌ 4, వ్యవసాయశాఖ1, నీటి పారుదల శాఖ 1, వైద్యం 1, డిఆర్‌డిఎ 1, ఎస్‌సి సంక్షేమ శాఖ 1, ఆర్‌డబ్ల్యుఎస్‌ నుంచి 1 ...

Read More »

కేంద్రమంత్రి రేసులో అర్వింద్‌?

సోయం బాబూరావుకు దాదాపు ఖరారు నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2019 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో నాలుగు ఎంపి సీట్లు దక్కించుకున్న విషయం తెలిసిందే. వీరిలో నిజామాబాద్‌ ఎంపిగా అర్వింద్‌ ధర్మపురి, కరీంనగర్‌ నుంచి బండి సంజయ్‌, ఆదిలాబాద్‌ నుంచి సోయం బాబూరావు, సికింద్రాబాద్‌ నుంచి కిషన్‌రెడ్డి ఉన్నారు. కాగా కేంద్ర మంత్రి వర్గంలో తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరికి చోటుదక్కుతుందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిజామాబాద్‌ ఎంపి అర్వింద్‌కు మంత్రి పదవి, అలాగే ...

Read More »

వాహనాల తనిఖీ

రెంజల్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాటాపూర్‌ తెలంగాణ చౌరస్తాలో ఎస్‌ఐ శంకర్‌ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేపట్టారు. లైసెన్స్‌, ఆర్‌సి, ఇన్సూరెన్స్‌ లేనటువంటి వాహనాలకు జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. వాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలని వాహనాలకు సంబంధించిన పత్రాలను కలిగి ఉండాలని అన్నారు. లేనియెడల జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు.

Read More »

ప్రజల వద్దకే పంతుళ్లు

రెంజల్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలో ప్రజల వద్దకే పంతుళ్లు అనే నినాదంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలు ఎందులోనూ తక్కువ కాదని, చివరికి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఆంగ్లమాధ్యమంలో సైతం విద్యాబోధన చేస్తూ, సకల వసతులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడికి ఉపాధ్యాయులు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చచెబుతున్నారు. రెంజల్‌ మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామంలో ఉపాధి పనులు జరిగే చోటుకు వెళ్లి తమ పాఠశాలలో ...

Read More »

విద్యుత్‌షాక్‌తో పెయింటర్‌ మృతి

కామారెడ్డి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి చౌరస్తాలో భవనానికి పెయింట్‌ వేస్తుండగా ఓ పెయింటర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌ జిల్లాకు చెందిన ఉమేశ్‌ అనే వ్యక్తి వృత్తిరీత్యా పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలొని రామారెడ్డి చౌరస్తాలో పేయింట్‌ వేస్తుండగా 11 కెవి హై టెన్షన్‌ విద్యుత్‌ తీగలు షాక్‌ తగిలి క్రింద పడి అక్కడికక్కడే మరణించాడు. మృతుని కుటుంబ సభ్యులకు ఇంటి యజమాని నష్టపరిహారం 5 ...

Read More »

నర్సరీ పరిశీలించిన ఏపీవో సుదర్శన్‌

నిజాంసాగర్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొక్కల సంరక్షణ పకడ్బందీగా చేయాలని ఏపీవో సుదర్శన్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని నర్వ, హసన్‌ పల్లి గ్రామాల్లో ఉపాధిహామీ నర్సరీలను పరిశీలించారు. అనంతరం ఏపీవో మాట్లాడుతూ మొక్కల సంరక్షణ పకడ్బందీగా చేయాలన్నారు. మొక్కలను ఎల్లవేళల కాపాడుతూ ఉండాలని, మొక్కలకు మూడు లేదా నాలుగు సార్లు నీటిని పట్టాలని చెప్పారు. మొక్కల సంరక్షణ మంచిగా చేయాలనానరు. ఏపీవో వెంట పంచాయతీ కార్యదర్శి రఘుపతి రెడ్డి, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బాలరాజు తదితరులు ఉన్నారు.

Read More »

నవోదయలో నలుగురు విద్యార్థులకు ప్రవేశం

బీర్కూర్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నెలలో నిర్వహించిన జవహర్‌ నవోదయ 6 వ తరగతి ప్రవేశ పరీక్షలో మండలంలో ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థిని విద్యార్థులు అర్హత సాధించారని మండల విద్యా వనరుల అధికారి నాగేశ్వర్‌ రావు ఒక ప్రకటనలో తెలిపారు. బీర్కూర్‌ మండలం బరంగెడ్గి గ్రామానికి చెందిన జీవన సౌమ్య, అంకోల్‌ తాండా గ్రామానికి చెందిన సాయి మనోహర్‌, సంగెం గ్రామానికి చెందిన పుష్పలత, యుగందర్‌లు జవహర్‌ నవోదయ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించారని ...

Read More »

దత్తత పాఠశాల అభివద్ధికి కషి

నిజాంసాగర్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దత్తత పాఠశాలను అభివద్ధి చేయడమే లక్ష్యమని పిఆర్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుషాల్‌ అన్నారు, నిజాంసాగర్‌ మండలంలోని తుంకి పల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ దత్తత తీసుకున్న పాఠశాలలను పిఆర్‌టియు ఆధ్వర్యంలో అభివద్ధి చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ లింగాల వసంత రాంచందర్‌, ఉపాధ్యాయుడు శరత్‌చంద్ర చౌదరి, పిఆర్‌టియు అధ్యక్షుడు భాస్కర్‌ గౌడ్‌, ప్రధాన కార్యదర్శి సంతోష్‌ కుమార్‌, గ్రామ పెద్దలు లింగయ్య , రవి, విఠల్‌, సాయగౌడ్‌ తదితరులు ...

Read More »