Breaking News

Monthly Archives: June 2019

సోమవారం కామారెడ్డికి కలిసి నడుద్దాం కార్యక్రమం

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌, యువజన రాష్ట్ర నాయకుడు రాజిరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కలిసి నడుద్దాం కార్యక్రమం సోమవారం కామారెడ్డికి చేరుకుంటుందని కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ అద్యక్షుడు కోయల్‌కర్‌ కన్నయ్య తెలిపారు. సోమవారం ఉదయం పదిగంటలకు కామారెడ్డికి నాయకులు చేరుకుంటారన్నారు. కామారెడ్డిలో కార్యక్రమం అనంతరం అన్ని మండల యువజన కాంగ్రెస్‌ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఇంటి వద్ద సమావేశం ఉంటుందన్నారు. దీనికి పార్టీ నాయకులు ...

Read More »

చినుకు పడితే చిత్తడే…

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని రోడ్లు చినుకు పడితే చిత్తడిగా మారుతున్నాయి. ఆదివారం కురిసిన చిన్నపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు చిత్తడిగా మారి ప్రజలకు నడవడానికి కూడా ఇబ్బందిగా మారాయి. అయ్యప్పనగర్‌ కాలనీ, బతుకమ్మ కుంట, ఆర్‌బి నగర్‌, ఎరుకలవాడ, హరిజనవాడ వంటి లోతట్టు ప్రాంతాల్లో రోడ్ల మధ్య నీరు నిలిచి ద్విచక్ర వాహన చోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షానికే ఈ పరిస్తితి ఉంటే వర్షాలు భారీగా కురిసినప్పుడు గుంతలు ...

Read More »

తెరాస సభ్యత్వ నమోదు

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం కామారెడ్డిలో పార్టీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు జరిపారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ఆదేశాల మేరకు ఆయన ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమిస్తామని పేర్కొన్నారు. పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని చెప్పారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎంపి బి.బి.పాటిల్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్‌లు పార్టీ సభ్యత్వనమోదులో పాల్గొన్నారు. కామారెడ్డిలో ఎమ్మెల్సీ వి.జి.గౌడ్‌, నాయకులు ముజీబుద్దీన్‌, ...

Read More »

పారిశుద్య నిర్వహణలో కామారెడ్డి బల్దియా అస్తవ్యస్తం

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పారిశుద్య వ్యవస్థ నిర్వహణలో కామారెడ్డి బల్దియా అధికారులు పూర్తిగా విఫలమయ్యారని పట్టణంలోని ఏ వార్డులో చూసినా చెత్త దర్శనమిస్తుందని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని 1వ వార్డు నుంచి 10 వార్డుల్లో పర్యటించారు. పారిశుద్యం, రోడ్లు, నీటి సమస్యపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ చెత్తను ఎత్తి డంపింగ్‌ యార్డుకు తరలించకపోవడంతో కామారెడ్డి చెత్తకు ...

Read More »

హరితహారం విజయవంతం చేయాలి

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారాన్ని విజయవంతం చేయడంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని, అందరు భాగస్వాములు కావాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పిలుపునిచ్చారు. మొక్కలునాటి సంరక్షించాలన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో హిందీ ఉపాధ్యాయులు గఫూర్‌ శిక్షక్‌ హరితహారానికి సంబంధించి రాసిన హిందీ నినాదాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తు సామాజిక బాధ్యతతో హరితహారంపై రాసిన నినాదాలు బాగున్నాయని ప్రశంసించారు. గఫూర్‌ శిక్షక్‌ మాట్లాడుతూ అన్ని పాఠశాలలకు నినాదాల కరపత్రాలను ...

Read More »

కోమలంచ నర్సరీ పరిశీలన

నిజాంసాగర్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని కోమలంచ గ్రామంలో నర్సరీని పంచాయతీ కార్యదర్శి గోపాల్‌ పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కనీసం ఐదు మొక్కలు నాటి వాటి సంరక్షణ చేయాలన్నారు. నర్సరీలో 80వేల మొక్కలను పెంచడం జరుగుతుందన్నారు. ఆయన వెంట సాదుల సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.

Read More »

సోమవారం కల్లా వార్డుల పునర్విభజన పూర్తి చేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపాలిటీలలో వార్డుల పునర్విభజన సోమవారం వరకు పూర్తి చేయాలని కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన నగర పాలక సంస్థ కార్యాలయంలో పర్యటించి ఓటర్ల జాబితా సిద్ధం చేయడం, పునర్విభజన కార్యక్రమాలకు సంబంధించి పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వార్డుల పునర్విభజన ప్రచురణ కార్యక్రమానికి సంబంధించి మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఈ ఆదేశాల ప్రకారం ...

Read More »

ప్రభుత్వ వైద్యాలయాలు.. ప్రసూతికి నిలయాలు

ప్రైవేటుకు ధీటుగా మెరుగైన సేవలు రెంజల్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానాలంటేనే గర్భిణీలు ఆమడ దూరంలో ఉండేవారు. అప్పు చేసైనా ప్రైవేట్‌ ఆస్పత్రిలో పురుడు పోసుకునే వారు. కడు పేదరికంలో ఉన్నా తల్లి పాల క్షేమం కోరి పట్టణాలకు పరుగులు తీసే వారు. సర్కారు ఆసుపత్రిలో వైద్యులు ఉన్నా కాన్పులు చేసేందుకు ఆసక్తి చూపేవారు కాదు. నెలకు ఐదో ఆరో కాన్పులు చేసేవారు. కానీ రోజులు మారాయి. వైద్యులు మారారు. పేదలకు మేమున్నామని భరోసా ఇస్తున్నారు. ...

Read More »

లక్ష్యం మేరకు మొక్కలు పెంచాలి

నిజామాబాద్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లక్ష్యం మేరకు నర్సరీలో మొక్కలు పెంచాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ముప్కాల్‌ మండల కేంద్రంలో డిఆర్‌డిఎ ద్వారా నర్సరీని జిల్లా కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏ మొక్కలు నర్సరీలో పెంచుతున్నారని అడిగి తెలుసుకున్నారు. మండలంలో గ్రామ పంచాయతీకి 40 వేల మొక్కలను పెంచే లక్ష్యానికి అనుగుణంగా నర్సరీలలో సిద్ధం చేయాలని, మొక్కలను నాటిన తర్వాత సంరక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ...

Read More »

మద్యంసేవించి వాహనాలు నడిపితే జైలుకే…

కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో 14 మందికి జరిమానా విధించి కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్‌ఐ గోవిందు తెలిపారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన 14 మందికి రూ. 2 వేల జరిమానాతోపాటు రెండ్రోజుల జైలుశిక్ష విధించనున్నట్టు పేర్కొన్నారు. మద్యంసేవించి వాహనాలు నడిపితే జరిమానా, జైలు తప్పదు హెచ్చరించారు.

Read More »

ఏఐఎస్‌ఎఫ్‌ ఆద్వర్యంలో సైకిల్‌జాతా

కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్‌ఎఫ్‌ ఆద్వర్యంలో జూలై 1వ తేదీ నుంచి సైకిల్‌జాతా ప్రారంభించనున్నట్టు జిల్లా ఉపాధ్యక్షుడు నరేశ్‌కుమార్‌ తెలిపారు. శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 340 కి.మీ.లు సైకిల్‌ జాతా నిర్వహిస్తామని, 1న లింగంపేట మండల కేంద్రంలో ప్రారంభమై 13వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు. విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గణేశ్‌, సాయి, రాజేశ్‌, రాజశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

డిజిటల్‌ పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాలి

కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో డిజిటల్‌ పట్టాదారు పాసుపుస్తకాలు వెంటనే శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ రెవెన్యూ అధికారులకు సూచించారు. శనివారం జనహితలో ఏర్పాటైన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. పాసుపుస్తకాల పంపిణీని త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. వాటి వివరాలను మోబైల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని చెప్పారు. 8 వేల 145 నాలా కింద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మ్యూటేషన్‌ ద్వారా మార్పులు, చేర్పులు చేపట్టి జీరో స్థాయికి తేవాలని ఆదేశించారు. షాదీముబారక్‌, ...

Read More »

ప్రణాళికబద్దమైన ప్రగతికి గణాంకాలు ఉపయోగపడతాయి

కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రణాళిక బద్దమైన లక్ష్యాలతో ముందుకు వెళ్లడానికి గణాంకాలు ఎంతో ఉపయోగపడతాయని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. 13వ జాతీయ గణాంక దినోత్సవం, మొదటి ప్రణాళిక కమీషన్‌ మెంబరు ప్రశాంత చంద్ర మహాలనోవిష్‌ జయంతి సందర్బంగా శనివారం జిల్లా ప్రణాళిక శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన హాజరై మాట్లాడారు. ప్రశాంతచంద్రకు ప్రముఖ గణాంకవేత్తగా పేరుందని, తాను ప్రతిపాదించిన గణాంక సూత్రాలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రణాళిక బద్దంగా సామాన్యులకు చేరడంలో ఎంతో ...

Read More »

వార్డుల విభజన సశాస్త్రీయంగా నిర్వహించాలి

కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపాలిటిలో వివిధ గ్రామాలు విలీనమైన నేపథ్యంలో వార్డుల పునర్విభజనను పూర్తి సశాస్త్రియంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి శనివారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. గతంలో మాదిరిగా కాకుండా అన్ని అఖిలపక్ష నేతలతో సమావేశం ఏర్పాటు చేసి వారి ప్రతిపాదనలు, సూచనలు పరిగణలోకి తీసుకొని విబజన జరపాలన్నారు. ఓటర్లు, విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకొని సమగ్ర విధానం అవలంబించి విభజన చేయాలని కోరారు. ...

Read More »

గుండెపోటుతో వ్యక్తి మృతి

కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాగావళి ఎక్స్‌ప్రెస్‌ సంబల్‌పూర్‌ టు నాందేడ్‌ రైలులో శనివారం ప్రయాణిస్తున్న కంచర్ల రాజేందర్‌ (62) గుండెపోటుతో మృతి చెందినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. రాజేందర్‌కు గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్టు, అతని వద్ద లభించిన పత్రాల్లో ఉన్నట్టు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు.

Read More »

ఉపాధ్యాయుని రక్తదానం

కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌జిల్లా రామాయంపేట మండలానికి చెందిన కనకవ్వకు శస్త్రచికిత్స నిమిత్తం బి పాజిటివ్‌ రక్తం అవసరం కాగా సంగోజివాడ ప్రభుత్వ ఉపాధ్యాయుడు జమీల్‌ అహ్మద్‌ ఏడవసారి రక్తదానం చేశారు. రోగి తరఫు బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహం నిర్వాహకుడు బాలును ఆశ్రయించగా రక్తదాతల సమూహంలోని జమీల్‌ అహ్మద్‌ స్పందించి రక్తం ఇచ్చారు. ఈ సందర్బంగా బాలు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా రక్తదానం చేస్తు ప్రాణదాతలుగా నిలుస్తున్నామన్నారు. రక్తం అవసరమున్నవారు 9492874006 నెంబరును సంప్రదించాలని ...

Read More »

పిట్లం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌కు సన్మానం

నిజాంసాగర్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని సిడిసి కార్యాలయంలో పిట్లం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గైని విఠల్‌కు కారోబార్‌ల జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌ పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కారోబార్‌లు అంబయ్య, లింగాల రాములు, రాజు తదితరులు ఉన్నారు.

Read More »

ప్రాజెక్టు పనులను పూర్తిచేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్‌ఆర్‌ఎస్‌పి పునర్జీవ ప్రాజెక్టు పనులను ప్రభుత్వం నిర్దేశించిన గడువు కంటే ముందే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. కాలేశ్వరం ఎత్తిపోతల భారీ సాగునీటి ద్వారా వరద కాలువను ఆధారంగా చేసుకొని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో రోజుకు ఒక టీఎంసీ చొప్పున ఎత్తి పోసి ప్రాజెక్టు పరిధిలోని భూములను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నందున పనులను సత్వరమే పూర్తిచేసే విధంగా ఏజెన్సీ, ఇంజనీరింగ్‌ అధికారులు కషి చేయాలని జిల్లా ...

Read More »

హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వామం కావాలి

నిజాంసాగర్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తెలంగాణ హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగ్యస్వాములు కావాలని ఎంపిడీవో పర్బన్న తెలిపారు. నిజాంసాగర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో ఆయా గ్రామ సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బందితో హరితహారం పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు, యువకులు, మహిళలు, సభ్యులు ప్రజల భాగస్వామ్యంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. రైతుల పొలం గట్ల వెంబడి అవగాహన ...

Read More »

హసన్‌పల్లిలో ఎన్‌సీడీ క్యాంప్‌

నిజాంసాగర్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో ఎన్‌సీడీ క్యాంపు ఆధ్వర్యంలో మండల వైద్యాధికారి రాధాకిషన్‌ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హసన్‌పల్లి గ్రామంలో 45 మందికి బిపి, షుగర్‌, కాన్సర్‌కు సంబంధించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. వీరికి కావలసిన మందులను ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి గ్రామంలో బీపీ, షుగర్‌ ఉన్నవారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త సులోచన, ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భూమయ్య, ...

Read More »