Breaking News

Daily Archives: June 1, 2019

ప్రజలు సృష్టించుకున్న పదునైన ఆయుధం పాట

కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలు సృష్టించుకున్న పదునైన ఆయుధం పాట అని, సాహిత్య ప్రక్రియల్లో అత్యంత ప్రభావ వంతమైనదని, తెలంగాణ గడ్డమీద సాగిన అన్ని ఉద్యమాల్లో పాట ప్రధాన పాత్ర పోషించిందని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజోజు నాగభూషణం అన్నారు. తెరవే కామారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు గఫూర్‌ శిక్షక్‌ జన్మదినం సందర్బంగా ఆయన రచించి, రూపొందించిన ‘హోరు పాట సాక్షిగా’ ఆడియో సిడిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ...

Read More »

మండల జిల్లా పరిషత్‌ అధ్యక్షుల ఎన్నికలకు సమయాన్ని పాటించాలి

నిజామాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల ప్రజా పరిషత్‌, జిల్లా ప్రజా పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ జారి చేసిన సమయాన్ని కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఎంపీపీ, జెడ్‌పి అధ్యక్ష ఎన్నికలకు విధులు నిర్వహించే అధికారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికలు పార్టీల వారీగా పరోక్షంగా జరగనున్నందున రాష్ట్ర ఎన్నికల ...

Read More »

రంజాన్‌ దుస్తుల పంపిణి

నిజాంసాగర్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండలంలోని బండ్లపల్లి గ్రామంలో ఎంపీపీ రజిని కాంత్‌ రెడ్డి మైనారిటీలకు రంజాన్‌ దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మైనార్టీలకు పెద్దపీట వేస్తుందన్నారు. కెసిఆర్‌ పాలనలో గ్రామాల అభివద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. మైనార్టీ ఆడపడుచుల కోసం కళ్యాణలక్ష్మి పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని, మరెన్నో అభివ ద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.

Read More »

రంజాన్‌ కిట్‌ల పంపిణీ

నిజాంసాగర్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ పట్టణంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో తెలంగాణ ప్రభుత్వం తరపున పేద ముస్లింలకు శాసనసభ్యులు భూపాల్‌ రెడ్డి దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు ప్రతీ విషయంలో పెద్ద పీట వేస్తూ వారి అభివద్ధికి కషి చేస్తుందన్నారు. కేసీఆర్‌తోనే గ్రామాల అభివద్ధి జరుగుతుందన్నారు. ముస్లిం ఆడపడుచుల కోసం కళ్యాణ లక్ష్మి పథకాలను చేపట్టడం జరిగిందన్నారు. అలాగే ఆదివారం నారాయఖేడ్‌ పట్టణంలోని రహేమాన్‌ ...

Read More »

పశువులకు వ్యాధి నివారణ టీకాలు

ఆర్మూర్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉచిత గొంతువాపు, జబ్బవాపు, చిటుక రోగ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం ఆర్మూర్‌లో శనివారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా మామిడిపల్లి, గోవింద్‌ పేట్‌ గ్రామాల్లో పశువైద్య సిబ్బంది నాలుగు నెలల పైబడి మూడు సంవత్సరాల లోపు ఉన్న పశువులకు ఉచితంగా గొంతువాపు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం జరిగిందని మండల పశు సంవర్ధకశాఖ అధికారి లక్కం ప్రభాకర్‌ తెలిపారు. సాధారణంగా గ్రామాల్లో టీకాలను పసక సూదులు అంటూ ఉంటారు. మండే ఎండలలో కార్యక్రమం ...

Read More »

ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా సాంస్క తిక కార్యక్రమాలు

నిజామాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఒక ప్రకటనలో తెలిపారు. రెండవ తేదీన సాయంత్రం స్థానిక రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం పక్కనగల కొత్త అంబేద్కర్‌ భవన్‌లో సాయంత్రం సాంస్క తిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమాలు సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం అవుతాయని, కార్యక్రమాలలో కూచిపూడి, భరతనాట్యం తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కళాభిమానులు, పిల్లలు, తల్లిదండ్రులు, ...

Read More »

అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి

ఆర్మూర్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనుల్లో అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏఐకేఎంయస్‌ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌ తెలిపారు. శనివారం ఆర్మూర్‌ మండలంలోని కుమార్‌ నారాయణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో ఉపాధి లేక ప్రజలు అల్లాడుతున్న కూలీలకు పని కల్పించాలని ఎన్నో ఉద్యమాల ఫలితంగా యూపిఏ ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ని తీసుకురావడం జరిగిందన్నారు. కూలీల పనుల్లో కూడా అవినీతికి పాల్పడటం శోచనీయమన్నారు. చట్టంలోని అంశాలను అమలు చేయడంలో విఫలమయ్యారని, ఇప్పటికే ...

Read More »

మహిళలకు పోషకలోపాలు లేకుండా చూడాలి

రెంజల్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిల్లలకు, మహిళలకు పోషకాలలో లోపాలు లేకుండా చూడాలని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ ప్రమీల అన్నారు. శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషన్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని శనివారం మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో నిర్వహించారు. కిశోర బాలికలకు పోషకాహారంపై అవగాహన నిర్వహించి బాల్య వివాహాలు విద్యాహక్కు చట్టంపై అవగాహన కల్పించారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉండేందుకు గర్భిణీ స్త్రీలు తప్పక పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అంగన్‌వాడి కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ ...

Read More »