Breaking News

చనిపోయి బతికింది…?

జగిత్యాల, జూన్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల జిల్లా సారాంగపూర్‌ గ్రామానికి చెందిన కనకమ్మ అనే మహిళ తలకు గాయమవడంతో కుటుంబీకులు అత్యవసర చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే ఆమె చనిపోయినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు మ తదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చి దహన సంస్కరాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సమయంలో కనకమ్మ ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఆమె బతికే ఉందని గుర్తించి ఆనందంతో హుటాహుటిన జగిత్యాలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు బాధితురాలు కనకమ్మకు ముందుగా వైద్యం అందించిన ఆస్పత్రి సిబ్బందిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే కనకమ్మ చనిపోయిందని అనుకున్నామని వాపోయారు. ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు.

Check Also

మాస్క్‌లు ధరించకపోతే ప్రమాదంలో పడినట్టే

హైదరాబాద్‌ ప్రతినిధి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనాతో భారత్‌ పోరాటం చేస్తోందని ప్రధాని నరేంద్ర ...

Comment on the article