Breaking News

Daily Archives: June 4, 2019

రెంజల్‌ ఎంపిటిసిలు వీరే

రెంజల్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నెల జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో రెంజల్‌ మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు, 1 జెడ్పిటిసి స్థానానికి ఎన్నికలు జరిగాయి. మంగళవారం వెలువడిన ఫలితాల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ 5 ఎంపీటీసీ స్థానాలు కైవసం చేసుకోగా బిజెపి 5 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు విజయం సాధించారు. రెంజల్‌-1 స్థానానికి బీజేపీ తరపున పోటీ చేసిన లోలపు రజిని సమీప స్వతంత్ర అభ్యర్థి తిరుపతి హన్మాండ్లుపై 193 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రెంజల్‌-2 ...

Read More »

బెల్టు షాపుపై దాడి

కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం రామేశ్వరపల్లి గ్రామంలో బెల్టుషాపు నిర్వహిస్తు మద్యం అక్రమంగా విక్రయిస్తున్న దుకాణంపై దాడిచేసి పోలీసులు అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన పెరక రాజు అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్దనుంచి 21 ఆఫీసర్‌ చాయిస్‌ బాటిళ్ళను, నాలుగు బీర్లను, ఇతర మద్యం సీసాలను స్వాదీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్టు పేర్కొన్నారు.

Read More »

ఓట్ల లెక్కింపును పరిశీలించిన ప్రత్యేకాధికారులు

కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మంగళవారం జరిగిన జడ్పిటిసి, ఎంపిటిసి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల పరిశీలకురాలు అభిలాష్‌ బిష్ట్‌తో పాటు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులు పరిశీలించారు. ఎల్లారెడ్డి కేంద్రంతోపాటు కామారెడ్డి జీవదాన్‌ పాఠశాల, ఇతర కౌంటింగ్‌ కేంద్రాలకు వెళ్ళి స్వయంగా ఓట్ల లెక్కింపు సరళిని తనిఖీ చేశారు. వెబ్‌కాస్టింగ్‌ ద్వారా సైతం ఓట్ల లెక్కింపు సరళిని పర్యవేక్షించారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగింది. ఫలితాలు విడుదలయ్యేంతవరకు ...

Read More »

అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్‌ బియ్యం పట్టివేత

కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్‌ బియ్యాన్ని జంగంపల్లి ఆర్‌టిఎ చెక్‌పోస్టు వద్ద పౌరసరఫరాల శాఖ అధికారులు ఏఎస్‌వో తనూజ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు దాడులు జరిపి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఆర్‌టిఎ చెక్‌పోస్టు వద్ద లారీని తనిఖీ చేయగా అందులో 235 క్వింటాళ్ల పిడిఎస్‌ బియ్యం పట్టుబడినట్టు అధికారులు తెలిపారు. బియ్యాన్ని గద్వాల నుంచి నాగ్‌పూర్‌కు అక్రమంగా తరలిస్తున్నట్టు పేర్కొన్నారు. లారీ డ్రైవర్‌, సంబంధిత నిందితులపై సెక్షన్‌ 6 ఎ కింద ...

Read More »

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఆధిపత్యం

కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జడ్పిటిసి, ఎంపిటిసి ఓట్ల లెక్కింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి గాను ఏడు జడ్పిటిసి స్తానాలుండగా కాంగ్రెస్‌ నాలుగు స్థానాలు గెలుచుకోగా, తెరాస మూడు స్థానాల్లో నిలిచింది. స్తానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పైచేయి నిలిచింది. ఎల్లారెడ్డి ఉషాగౌడ్‌- కాంగ్రెస్‌, గాంధారి శంకర్‌నాయక్‌-తెరాస, నాగిరెడ్డిపేట్‌ మనోహర్‌రెడ్డి – కాంగ్రెస్‌, తాడ్వాయి రమాదేవి -తెరాస, లింగంపేట్‌ శ్రీలతరెడ్డి – కాంగ్రెస్‌, సదాశివనగర్‌ నర్సింలు -తెరాస, రామారెడ్డి మోహన్‌రెడ్డి-కాంగ్రెస్‌లు విజయఢంకా మోగించారు.

Read More »

బాన్సువాడలో ఏడు జడ్పిటిసి స్థానాలు తెరాస కైవసం

కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిదిలో 8 జడ్పిటిసి స్థానాలకు గాను ఏడు స్థానాలను తెరాస కైవసం చేసుకుంది. ఇటీవల జరిగిన జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల అనంతరం మంగళవారం ఓట్ల లెక్కింపు జరిగింది. బాన్సువాడలో తెరాస జెండా ఎగురవేసింది. బాన్సువాడ పద్మ గోపాల్‌రెడ్డి -తెరాస, బీర్కూర్‌ స్వరూప శ్రీనివాస్‌ -తెరాస, నసురుల్లాబాద్‌ జన్నుబాయి పర్త్‌అల్‌ – తెరాస, వర్ని హరిదాస్‌-తెరాస, రుద్రూర్‌ గంగారాం – తెరాస, కోటగిరి శంకర్‌ పటేల్‌ -తెరాస, మోస్రా ...

Read More »

కామారెడ్డి డివిజన్‌లో మెజార్టీ జడ్పిటిసి స్థానాలు తెరాస కైవసం

కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జడ్పిటిసి, ఎంపిటిసి స్థానిక ఎన్నికలకు మంగళవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా ముగిసింది. కామారెడ్డి డివిజన్‌ పరిధిలో మొత్తం 9 జడ్పిటిసి స్థానాలకుగాను తెరాస 6 స్థానాలు గెలుచుకొని మెజార్టీ సీట్లను తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్‌ మూడుస్తానాలు గెలుచుకుంది. భిక్కనూరు కాంగ్రెస్‌ తాటిపాముల పద్మ, దోమకొండ తీగల తిరుమల్‌ గౌడ్‌-కాంగ్రెస్‌, కామారెడ్డి చిదుర రమాదేవి -తెరాస, మాచారెడ్డి రాంరెడ్డి – తెరాస, బీబీపేట్‌ పరికి ప్రేమ్‌కుమార్‌-తెరాస, రామారెడ్డి మోహన్‌రెడ్డి – ...

Read More »

ప్రశాంతంగా స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు

నిజామాబాద్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నెలలో స్థానిక సంస్థలైన జెడ్‌పిటిసి, ఎంపీటీసీలకు 6, 10, 14 తేదీలలో నిర్వహించిన ఎన్నికలకు ఈనెల 4న మంగళవారం జిల్లాలోని మూడు డివిజన్లలో జరిగిన ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌ స్థాయిలో 297 ఎంపీటీసీలు, 26 జడ్పిటిసిలకు ఓట్ల లెక్కింపు ఆయా డివిజన్‌ పరిధిలో నిర్వహించగా కలెక్టర్‌ జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను వెబ్‌ ...

Read More »

ఇఫ్తార్‌ విందులో ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి

ఆర్మూర్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు రంజాన్‌ మాసంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో భాగంగా మంగళవారం ఆర్మూర్‌ ఎమ్మల్యే జీవన్‌ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. నెలరోజుల పాటు పవిత్రంగా పరమత సహనాన్ని మత సామరస్యాన్ని ఆధ్యాత్మికతను చాటే పవిత్రమైన పండుగ రంజాన్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో మైనారిటీలు గౌరవించ బడుతున్నారని అయన గుర్తు చేసారు. రంజాన్‌ మాసంలో పేద కుటుంబాలకు ఉచిత బట్టల పంపిణి కేవలం తెలంగాణ ప్రభుత్వంలో అందించడం జరుగుతుందన్నారు. ...

Read More »

కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్‌

రెంజల్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ డివిజన్‌లో జరుగుతున్న పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ని మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావ్‌ పరిశీలించారు. బోధన్‌ డివిజన్లోని 8 మండలాల కౌంటింగ్‌ను బోధన్‌లోని విద్యా వికాస్‌ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేశారు. బోధన్‌ డివిజన్లోని వర్ని, కోటగిరి, రుద్రూర్‌, చందూర్‌, మోస్ర, బోధన్‌, ఎడపల్లి, రెంజల్‌ మండలాల ఓట్ల లెక్కింపు విద్యా వికాస్‌ కళాశాలలో ప్రారంభం కాగానే కలెక్టర్‌ అక్కడికి చేరుకొని పరిశీలించారు ఆయన వెంట ఆర్డీవో గోపి రామ్‌, ...

Read More »

రెంజల్‌ జడ్పిటిసిగా మేక విజయ విజయం

రెంజల్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం జడ్పీటీసీగా బీజేపీ పార్టీ అభ్యర్థి మేక విజయ విజయం సాధించారు. తమ సమీప టిఆర్‌ఎస్‌ అభ్యర్థి అయేషా సిద్ధిఖీపై ఆమె విజయం సాధించారు. రెంజల్‌ జడ్పీటీసీ స్థానం కోసం ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార పార్టీ అయిన టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌తో పాటు బీజేపీ నుండి అభ్యర్థులు పోటీ పడ్డారు. హోరాహోరీగా ప్రచారం కొనసాగించారు. బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన విజయ తమ సమీప టిఆర్‌ఎస్‌ అభ్యర్థి అయేషా సిద్ధిఖీపై 454 ...

Read More »