Breaking News

Daily Archives: June 6, 2019

ఇందూరువాసికి బంగారు పతకం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యూఢిల్లీలో బుధవారం ప్రారంభమైన తైక్వాండో మూడవ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో నిజామాబాద్‌ క్రీడాకారులు అసామాన్య ప్రతిభ కనబరిచారు. బ్లాక్‌ బెల్ట్‌ 3వ డాన్‌ బి.హీరాలాల్‌ శిక్షణలో ముగ్గురు కరాటే నేర్చుకుని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. ఫూమెసే విభాగంలో జమాల్‌పూర్‌ వైష్ణవ్‌ బంగారు పతకం సాధించగా, ఇదే విభాగంలో చింత ధన్వి, బి.హర్షవర్ధన్‌ రజిత పతకం గెలుపొందారు. తనవద్ద శిక్షణ పొందిన ముగ్గురు అంతర్జాతీయ స్థాయి పోటీలో పతకాలు సాధించడం సంతోషంగా ఉందని కరాటే ...

Read More »

గుర్తు తెలియని వ్యక్తి మృతి

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామేశ్వరపల్లి గ్రామ సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై పడి ఉండగా స్తానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతు మరణించాడు. వివరాలు తెలియాల్సి ఉంది…

Read More »

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కామారెడ్డి నూతన అధ్యక్షుడు ముప్పారపు ఆనంద్‌ గుప్త, కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు యాద నాగేశ్వర్‌ రావు, కామారెడ్డి జిల్లా పిఆర్‌ఓ విశ్వనాధుల మహేష్‌ గుప్త, అడ్మినిస్ట్రేషన్‌ సెక్రటరీ గారిపల్లి శ్రీధర్‌ గుప్త ఎమ్మెల్యేను సన్మానించారు. నూతన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే గోవర్ధన్‌ అభినందనలు తెలిపారు. సంఘం అభివృద్దికి తోడ్పడతామని ...

Read More »

రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుంది

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌ పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్‌ పార్టీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, అసెంబ్లీ పక్ష నేత బట్టి విక్రమార్క తదితరులు అసెంబ్లీ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్‌ నియంత పాలన కొనసాగుతుందని, ప్రతిపక్షం లేకుండా చేయాలని సీఎం కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ...

Read More »

ప్యానల్‌ స్పీకర్‌ను కలిసిన నిజాంసాగర్‌ ఎంపిటిసిలు

నిజాంసాగర్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని ఆయా గ్రామాల తెరాస ఎంపీటీసీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడంతో అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ హన్మంత్‌ షిండే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించడంతో అభినందనలు తెలిపారు. అనంతరం హన్మంత్‌షిండే మాట్లాడుతూ సిఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివద్ధి సాధ్యమన్నారు. టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించడంతో గ్రామాల అభివద్ధి పట్టణాలు అభివద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. నిరుపేద ఆడపడుచుల కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ...

Read More »

ఎంపీ బీబీపాటిల్‌ను కలిసిన ఎంపిటిసిలు

నిజాంసాగర్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని ఆయా గ్రామల టీఆర్‌ఎస్‌ ఎంపిటిసిలు పట్లోళ్ల లక్ష్మి దుర్గారెడ్డి, చాకలి సుజాత రమేష్‌, ఎంపీ బీబీ పాటిల్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తెలంగాణ అభివద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. ఏ ప్రభుత్వాలు కూడా అభివద్ధి జరగలేదని కెసిఆర్‌ పాలనలో అభివద్ధి జరుగుతుందన్నారు. వారి వెంట సర్పంచ్‌ రమేష్‌ గౌడ్‌, ఎయంసి వైస్‌ చైర్మన్‌ గైని విట్ఠల్‌, యటకరి నారాయణ, నాయకులు శ్రీకాంత్‌ ...

Read More »

అక్కా చెల్లెళ్ళ అదశ్యం

బీర్కూర్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని బొమ్మన్‌దేవుపల్లి గ్రామంలో అక్కా చెల్లెళ్ళు అదశ్యమయ్యారని ఎస్‌ఐ సందీప్‌ తెలిపారు. పోలిసుల కథనం ప్రకారం బోమన్‌ దేవ్‌పల్లి గ్రామానికి చెందిన కుర్మా మల్లయ్య, సాయవ్వ దంపతులకు సంధ్యారాణీ, మౌనిక ఇద్దరు కుమార్తెలు. వీరు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో సంధ్య రాణి 9వ తరగతి, మౌనిక 8వ తరగతి చదువుతున్నారు. తండ్రి మల్లయ్య ఉపాధి కొరకు దుబాయ్‌ వెళ్ళగా ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన ఉదయం తల్లి సాయవ ...

Read More »