Breaking News

Daily Archives: June 7, 2019

ఉపాధి కూలీలకు 200 రోజులు పనికల్పించాలి

ఆర్మూర్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌పల్లి మండలంలోని ఆర్గుల్‌ గ్రామంలో ఏఐకెఎంఎస్‌ ఆధ్వర్యంలో ఉపాధి పనులు జరిగే స్థలాన్ని పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఉపాధి కూలీలకు ప్రతిఒక్కరికి 200 రోజుల పని కల్పించాలని, రోజువారి రూ. 350 కూలీ, ఉచిత వైద్యసదుపాయం, భీమ కల్పించాలని, గడ్డ పారా, నారా తట్టలు కొత్తవి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పనులను పరిశీలించిన వారిలో ఏఐకెఎంఎస్‌ రాష్ట కార్యదర్శి ప్రభాకర్‌, రాష్టనాయకులు దేవరాం, గంగాధర్‌, మారుతి, గ్రామస్థులు ఉన్నారు.

Read More »

జుక్కల్‌ నియోజక వర్గంలో ఎంపిపిలు వీరే

నిజాంసాగర్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌ నియోజకవర్గంలో తెరాస పార్టీ ఎంపిపి స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. మద్నూర్‌ – లక్ష్మీ బాయి ఎంపిపి తెరాస, జైపాల్‌ రెడ్డి వైస్‌ ఎంపిపి తెరాస, బిచ్కుంద – అశోక్‌ పటేల్‌ ఎంపిపి తెరాస, రాజు పటేల్‌ వైస్‌ ఎంపిపి తెరాస, జుక్కల్‌ – యశోద ఎంపిపి తెరాస, ఉమాకాంత్‌ వైస్‌ ఎంపిపి తెరాస, పెద్ద కొడపగల్‌ – ప్రతాప్‌ రెడ్డి ఎంపిపి తెరాస, బోధనం లక్ష్మీ వైస్‌ ఎంపిపి తెరాస, ...

Read More »

ఎంపీపీ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన

రెంజల్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఎంపిపి ఎన్నికల ఏర్పాట్లపై బోధన్‌ ఆర్టీవో గోపిరామ్‌ పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో ఎంపీపీ ఎన్నిక జరిగే విధంగా కషి చేయాలని, ఎంపిడిఓ చంద్రశేఖర్‌ను సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా ఎంపీపీ ఎన్నిక జరగాలని ఆయన అన్నారు.

Read More »

రెంజల్‌ ఎంపీపీగా లోలపు రజినీ

రెంజల్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల ఎంపీపీగా భారతీయ జనతాపార్టీకి చెందిన లోలపు రజినీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నిర్వహించిన ఎంపీపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రజిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సెట్టింగ్‌ ఆఫీసర్‌ రాజేందర్‌ తెలిపారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఐదుగురు అభ్యర్థులు, బీజేపీకి చెందిన 5 సభ్యులు ఉండడంతో స్వతంత్ర అభ్యర్థి కీలకంగా మారారు. దీంతో బిజెపి బలపరిచిన ఎంపీపీ అభ్యర్థి లోలపు రజినీకి మద్దతు పలకడంతో బీజేపీ అభ్యర్థి ఎంపిపిగా ...

Read More »

ఋతుపవనాలకు అనుగుణంగా అవసరమైన చర్యలు

నిజామాబాద్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రుతుపవనాలు ప్రారంభం కానున్నందున అవసరమైన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో రాబోయే రుతుపవనాలను దష్టిలో పెట్టుకొని అవసరమైన చర్యలకై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్‌, ఇంజనీరింగ్‌ శాఖలు, వైద్య ఆరోగ్యశాఖ వారి వంతుగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు కురిసి ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా ముందే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ...

Read More »

ఎన్నికల ప్రక్రియ పరిశీలనకు వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు

నిజామాబాద్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మండల పరిషత్‌ అధ్యక్షులు, వైస్‌ చైర్మన్‌, కో ఆప్షన్‌ నెంబర్‌ల ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రగతిభవన్‌లో ఏర్పాటుచేసిన వెబ్‌ కాస్టింగ్‌ జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు పరిశీలించారు. శుక్రవారం ఉదయం ప్రగతి భవన్‌కు వెళ్లి మండల వారీగా జరుగుతున్న కో ఆప్షన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంపీపీ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా జరిగేందుకు వీలుగా జిల్లా కేంద్రంలో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. జిల్లాలోని ...

Read More »

కువైట్‌లోని 92 కంపెనీలపై నిషేధం

కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించిన భారత విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌లో జాబితా ప్రకటించిన అధికారులు కువైట్‌ వెళ్లే కార్మికులు జాగ్రత్తపడాలని సూచన హైదరాబాద్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కువైట్‌లో నిబంధనల ప్రకారం వ్యవహరించకుండా కార్మికులను రోడ్డున పడేస్తున్న కంపెనీలను భారత విదేశాంగ శాఖ నిషేధించింది. ఈ కంపెనీలు కార్మికులకు పని కల్పించే పేరిట వీసాలను జారీచేసి కువైట్‌కు చేరిన తరువాత కార్మికులను పట్టించుకోవడం లేదని పేర్కొంది. ఈ విధమైన 92 కంపెనీలను గుర్తించి వాటిని బ్లాక్‌ లిస్టులో ...

Read More »

పశువులకు గొంతువాపు వ్యాధి నివారణ టీకాలు

ఆర్మూర్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మగ్గిడి గ్రామంలో శుక్రవారం ఉదయం 6 గంటలకు ఉచిత గొంతువాపు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం ప్రారంభించారు. గ్రామాభివద్ధి కమిటీ గురువారం ఉదయం, సాయంత్రం గ్రామంలో టీకాల కార్యక్రమం గురించి టాం టాం వేయించారు. శుక్రవారం ఉదయం పశువైద్య సిబ్బంది 5 గంటల 45 నిముషాలకే గ్రామానికి చేరుకుని 6 గంటలకు టీకాల కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో మగ్గిడి గ్రామం ఉండడం వల్ల మేతకు ఎటువంటి ఇబ్బంది ...

Read More »

ఆర్యవైశ్య మహాసభ మీడియా కమిటీ కో చైర్మన్‌గా మహేష్‌ గుప్తా

కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మీడియా కమిటీ కో చైర్మన్‌గా విశ్వనాధుల మహేష్‌ గుప్తాను రాష్ట్ర ఆర్యవైశ్య మహా సభ అధ్యక్షుడు అమరావాది లక్ష్మీనారాయణ, రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్‌ ఆగిరి వెంకటేశం నియమించినారు. విశ్వనాధ మహేష్‌ గుప్త మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడికి, మీడియా చైర్మన్‌కు, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు యాద నాగేశ్వర్‌ రావుకు, పట్టణ అధ్యక్షుడు ఆనంద్‌కు ప్రత్యేక కతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »