Breaking News

రెంజల్‌ ఎంపీపీగా లోలపు రజినీ

రెంజల్‌, జూన్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల ఎంపీపీగా భారతీయ జనతాపార్టీకి చెందిన లోలపు రజినీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నిర్వహించిన ఎంపీపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రజిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సెట్టింగ్‌ ఆఫీసర్‌ రాజేందర్‌ తెలిపారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఐదుగురు అభ్యర్థులు, బీజేపీకి చెందిన 5 సభ్యులు ఉండడంతో స్వతంత్ర అభ్యర్థి కీలకంగా మారారు.

దీంతో బిజెపి బలపరిచిన ఎంపీపీ అభ్యర్థి లోలపు రజినీకి మద్దతు పలకడంతో బీజేపీ అభ్యర్థి ఎంపిపిగా ఎన్నికయ్యారు. అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ నుండి ఎంపీపీ అభ్యర్థిగా ఎవరిని ప్రతిపాదించకపోవడంతో బీజేపీ అభ్యర్థి లోలపు రజినీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగా పటిష్టమైన బందోబస్త ఏర్పాటు చేయడంతో ఎంపీపీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల ప్రత్యేక అధికారి హన్మంత్‌ రావు, ఎన్నికల అధికారి చంద్రశేఖర్‌ తెలిపారు.

Check Also

తెలుగు ఫోరం ఏర్పాటు

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ట్రైబల్‌ వెల్ఫేర్‌ డిగ్రీ కాలేజ్‌లో 5 జిల్లాల తెలుగు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *